తెలంగాణలో కూడా ప్రభుత్వం అలానే చేస్తుందేమో: కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మాజీమంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  19 Dec 2023 11:19 AM IST
ktr, tweet,  congress govt, telangana  ,

తెలంగాణలో కూడా ప్రభుత్వం అలానే చేస్తుందేమో: కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మాజీమంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు చెందిన ఓవీడియోను రీపోస్ట్ చేశారు కేటీఆర్. ఆ వీడియోలో సిద్ధరామయ్య ఇలా చెప్పారు.. ఎన్నికల ప్రచారంలో చెప్పినంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా అని ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే కామెంట్స్ చేశారు. ఆ వీడియోను రీపోస్ట్ చేసిన కేటీఆర్.. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భవిష్యత్‌లో ఇలాగే మాట్లాడుతుందేమో అన్నారు.

ఎన్నికల హామీలపై కర్ణాటక అసెంబ్లీలో చర్చ జరిగింది. అన్ని హామీలను నెరవేర్చలేదంటూ విపక్షాలు అక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో మాట్లాడిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు డబ్బులు లేవని.. చెప్పినంత మాత్రాన అన్నీ ఫ్రీగా ఇవ్వాలా అంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఉత్తరాంధ్ర నౌ అనే సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. అదే పోస్టును మాజీ మంత్రి కేటీఆర్ రీపోస్టు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టిన కేటీఆర్.. ఎన్నికల వాగ్దానాలను, గ్యారెంటీలను నెరవేర్చేందుకు డబ్బు లేదని కర్ణాటక సీఎం అంటున్నారనీ చెప్పారు. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉండబోతుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కపట వాగ్ధానాలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఏ మాత్రం పరిశోధనలు చేయకుండా.. తెలంగాణలో కాంగ్రెస్‌ వాగ్దానాలను ఇచ్చిందని చెప్పారు. అమలుకు వీలుకాని హామీలు ఇచ్చిందని అన్నారు. ఎలాంటి ప్లానింగ్ లేకుండా విపరీతమైన ప్రకటనలు ఎలా ఇస్తారని కాంగ్రెస్‌ను ఎక్స్ వేదికగా నిలదీశారు కేటీఆర్. మరోవైపు తెలంగాణలో ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. అన్నీ అప్పులే మిగిల్చారనీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.


Next Story