లోకేశ్‌ జూమ్ మీటింగ్‌.. కొడాలి నాని, వల్ల‌భ‌నేని వంశీ ఎంట్రీ

Kodali Nani and Vallabhaneni Vamsi enters in Lokesh zoom meeting.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2022 2:43 PM IST
లోకేశ్‌ జూమ్ మీటింగ్‌.. కొడాలి నాని, వల్ల‌భ‌నేని వంశీ ఎంట్రీ

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌తో జూమ్ మీటింగ్‌ను నిర్వ‌హించారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల గురించి వారిని అడిగి తెలుసుకుంటుండ‌గా.. అనూహ్య సంఘ‌ట‌న చోటుచేసుకుంది. వైసీపీ చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మీటింగ్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

దీన్ని గ‌మ‌నించిన నారా లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌మావేశంలో వైసీపీ నేత‌లు ఉన్నా ఫ‌ర్వాలేద‌ని, వైసీపీ ప్ర‌భుత్వం ఎలా ఏడ్చిందో వారికీ తెలుస్తుంద‌న్నారు. విద్యార్థుల‌కు ఫెయిల్ చేయ‌డం ప్ర‌భుత్వం చేత‌గానిత‌న‌మ‌ని, జూమ్‌లో దొంగ ఐడీల‌తో స‌మావేశాన్ని డిస్ట‌ర్బ్ చేస్తారా..? అని లోకేశ్ మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలో వారు మీటింగ్ నుంచి త‌ప్పుకున్నారు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై తెలుగుదేశం పార్టీ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించింది. 'పదో తరగతి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు నారా లోకేష్ బాధితులతో, విద్యార్థుల తల్లిదండ్రులతో జూమ్ కాల్ లో మాట్లాడుతున్న సమయంలో.. వీళ్ళ వెకిలి నవ్వుల శాడిజం చూడండి. నీచ రాజకీయానికి ఇదా సమయం?' అంటూ ట్వీట్ చేసింది.

Next Story