సోనియా గాంధీ దేశ ద్రోహి

KA Paul Says Sonia Gandhi is a Traitor.ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై తీవ్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 May 2022 12:06 PM IST
సోనియా గాంధీ దేశ ద్రోహి

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ నేత‌లు డ‌ప్పు కొడుతున్న‌ట్లు సోనియా గాంధీ తెలంగాణ త‌ల్లి కాదని దేశ ద్రోహి అని విమ‌ర్శించారు. అంతేకాదు అస‌లు కాంగ్రెస్ పార్టీనే దేశ‌ద్రోహి పార్టీ అంటూ బాంబ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావన్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి బయటకు రావాలని సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 48 ఎంపీ స్థానాలకు పరిమితం అయ్యింద‌న్నారు. రానున్న‌ రోజుల్లో ఆ సంఖ్య 30 లేదా 20 కి త‌గ్గుతుంద‌న్నారు. పార్టీల కంటే దేశమే ముఖ్యమన్నారు. అయితే.. దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి పార్టీలేనని విమర్శించారు. జాతీయ రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ పై జరిగిన దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం సరికాదని, మాటల ద్వారా దాడి చేయడం కూడా తప్పేనని అన్నారు.

హైదరాబాద్‌లో రెడ్డి గర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ..అది రెడ్డి వర్గాల మధ్య జరిగిన గొడవ అని అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు తన పేరు చివరన రెడ్డిని తొలగించుకున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు కులమతాలను ఉపయోగించుకుని ప్రజలను రెచ్చగొడుతున్నాయని మండిప‌డ్డారు. దేశాన్ని నెంబర్ వన్ చేయాలనేదే తన తపన అని కేఏ పాల్ తెలిపారు.

Next Story