అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు భీమవరంలో సోమవారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో పాటు మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
తాజాగా ఈ కార్యక్రమంపై నటుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు సోషల్ మీడియా వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. 'మన్యం వీరుడు "అల్లూరి సీతారామరాజు" విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది, ఆ మహానుభావుడికి నా నివాళి. ఆ సభ లో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు. ఆ మహనటులందరికి ఇదే నా అభినందనలు'అంటూ ట్వీట్ చేశారు. నాగబాబు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.