తగ్గని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. ఢిల్లీకి జగిత్యాల ఇష్యూ
ఇటీవల బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 12:30 PM ISTతగ్గని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. ఢిల్లీకి జగిత్యాల ఇష్యూ
ఇటీవల బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేతగా ఉన్న జీవన్‌రెడ్డి కనీసం సమాచారం కూడా లేకుండా సంజయ్‌ని పీసీసీ పార్టీలో చేర్చుకుంది. అయితే.. సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడంపై జీవన్‌రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే సంజయ్ కింద పని చేయలేనని తేల్చి చెప్పారు. అంతేకాదు.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా కూడా చేస్తానని చెప్పారు. ఇప్పటికే రాజీనామా సిద్ధమైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పీసీసీ నాయకులు కలిసి నచ్చజెప్పినా ఆయన వినలేదు. దాంతో.. జీవన్‌రెడ్డికి ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు.
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రెండు రోజులుగా రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. దాంతో.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు. జగిత్యాలలో ఉన్న జీవన్‌రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు, విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కలిసి బుజ్జగించారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేలేదు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని చైర్మన్‌కు ఫోన్ ద్వారా జీవన్ రెడ్డి సమాచారం ఇచ్చారు. కానీ.. మండలి చైర్మన్ నల్లగొండ జిల్లా టూర్‌లో ఉండటం వల్ల జైన్ 26న లేఖ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే అధిష్టానం నుంచి కాల్ రావడంతో జీవన్ రెడ్డి, అడ్లూరి ఇద్దరూ కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసేందుకు వెళ్లారు.
జగిత్యాల కాంగ్రెస్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. దాంతో రంగంలోకి దిగింది. చేరికల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ పీసీసీ నాయకత్వానికి సూచించింది కాంగ్రెస్ అధిష్టానం. చేరికలతో పార్టీకి బలం పెరిగాలి తప్ప.. కొత్త సమస్యలు రావొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. జీవన్‌రెడ్డిని బుజ్జగించి సమస్యకు వెంటనే ముగింపు పలకాలని ఆదేశించారు. ఢిల్లీ వెళ్లిన జీవన్‌రెడ్డి.. ఖర్గేతో పాటు కేసి వేణుగోపాల్ ను కలవనున్నారు.