తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు శాసనసభ స్థానాల ఉప ఎన్నికకు మంగళవారం షెడ్యుల్ విడుదలైంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అక్టోబర్ 30న పోలింగ్‌ను నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
- అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల
- నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8
- అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13.
- అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్.
- నవంబర్ 2న ఓట్ల లెక్కింపు
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో, ఏపీలోని బద్వేల్‌లో వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి చెందడంతో ఉప ఎన్నికలు జరగనున్నాయి.