రాజవంశ రాజకీయాలపై శశి థరూర్ క‌థ‌నం.. కాంగ్రెస్ ఫైర్‌..!

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇటీవల అభిప్రాయ పోర్టల్ ప్రాజెక్ట్ సిండికేట్‌లో ఒక కథనాన్ని రాశారు. అందులో రాజకీయ రాజవంశ రాజకీయాలపై వ్యాఖ్యానించారు.

By -  అంజి
Published on : 4 Nov 2025 10:44 AM IST

Congress Leaders, Shashi Tharoor, Nepotism , National news

రాజవంశ రాజకీయాలపై శశి థరూర్ క‌థ‌నం.. కాంగ్రెస్ ఫైర్‌..!

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇటీవల అభిప్రాయ పోర్టల్ ప్రాజెక్ట్ సిండికేట్‌లో ఒక కథనాన్ని రాశారు. అందులో రాజకీయ రాజవంశ రాజకీయాలపై వ్యాఖ్యానించారు. రాజవంశం పేరుతో నడిచే రాజకీయాలు పాలనా నాణ్యతను ఎలా దెబ్బతీస్తుందనే దానిపై థరూర్ దృష్టి సారించారు. థరూర్ కథనాన్ని బిజెపి కాంగ్రెస్‌పై ఆయుధంగా మార్చింది. రాహుల్ గాంధీని నెపో కిడ్, తేజస్వి యాదవ్‌ను ఛోటా నెపో కిడ్ అని పిలిచి దాడి చేసింది. దీనిపై కాంగ్రెస్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.. అయితే గాంధీ కుటుంబాన్ని సమర్థిస్తూ పార్టీ నేతలు స్పందించారు.

కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ మాట్లాడుతూ.. 'వంశపారంపర్యం కేవలం రాజకీయాలకే పరిమితం కాదు. ఇది ప్రతి ప్రాంతంలోనూ వ్యాపించింది. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. వ్యాపారవేత్త కొడుకు వ్యాపారం నిర్వహిస్తాడు. కాబట్టి రాజకీయాలు కూడా దీనికి మినహాయింపు కాదు. నాయుడు నుండి పవార్ వరకు, డిఎంకె నుండి మమత వరకు, మాయావతి నుండి అమిత్ షా కొడుకు వరకు వంశపారంపర్య రాజకీయాలకు చాలా ఉదాహరణలు ఉన్నాయని ఉదిత్ రాజ్ అన్నారు.

కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ కూడా దీనిపై స్పందిస్తూ.. జవహర్ లాల్ నెహ్రూను దేశానికి అత్యంత సమర్థుడైన ప్రధానిగా అభివర్ణిస్తూ గాంధీ కుటుంబం త్యాగం, అంకితభావాన్ని ప్రస్తావించారు. ఈ దేశానికి అత్యంత సమర్థుడైన ప్రధాని పండిట్ నెహ్రూ అని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ తన జీవితాన్ని త్యాగం చేసింది. రాజీవ్ గాంధీ తన జీవితాన్ని త్యాగం చేసి దేశానికి సేవ చేశారు. భారతదేశంలో ఏ కుటుంబానికి ఇంత త్యాగం, అంకితభావం, సామర్థ్యం ఉన్నాయి? బీజేపీకి ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు.

మరో కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ కూడా వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. 'ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయాలు తీసుకుంటారు. మీ తండ్రి ఎంపీ అయితే.. మిమ్మ‌ల్నిఎవరిని నిషేధించరు, కాబట్టి మీరు ఎన్నికల్లో పోటీ చేయగ‌ల‌రు. ఇది ప్రతి ప్రాంతంలోనూ జరుగుతోందన్నారు.

Next Story