Telangana: కాంగ్రెస్‌కు షాక్.. BRSలో చేరిన సీనియర్ నేత
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 Oct 2023 2:15 PM ISTTelangana: కాంగ్రెస్‌కు షాక్.. BRSలో చేరిన సీనియర్ నేత
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా పార్టీల నుంచి టికెట్ ఆశించి లభించకపోవడంతో.. కొందరు నాయకులు షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతో బలమైన నేతగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎర్ర శేఖర్‌కు పేరుంది. అయితే.. ఆయన ఆదివారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కండువా కప్పి ఎర్ర శేఖర్‌ను మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్ర శేఖర్ చేరికతో పాలమూరులో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు ఎర్ర శేఖర్. అభివృద్ధి చేస్తున్న పార్టీలో చేరడం సంతోషంగా ఉందని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇక ముందు కలిసి పనిచేస్తానని వెల్లడించారు. అయితే.. ఉద్యమ సమయం నుంచే కేసీఆర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు ఎర్ర శేఖర్. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పుకొచ్చారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచేలా.. ఆత్మగౌరవంతో బతికేలా కేసీఆర్ సర్కార్ అనేక కార్యక్రమాలను తీసుకొచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలను భవిష్యత్‌లో ముందుకు తీసుకు వెళ్లేందుకు కేసీఆర్ నాయకత్వంలో నడిచేందుకు ఆ పార్టీలో చేరుతున్నట్లు ఎర్ర శేఖర్ చెప్పారు.