వైసీపీకి మరోషాక్.. మాజీమంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా

వైసీపీని పలువురు నాయకులు వీడుతున్నారు. ఆ పార్టీకి మాజీ మంత్రి, సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు.

By Medi Samrat
Published on : 2 Jan 2024 4:59 PM IST

dadi veerabhadra rao, shock,  ycp, andhra pradesh,

వైసీపీకి మరోషాక్.. మాజీమంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా 

వైసీపీని పలువురు నాయకులు వీడుతున్నారు. ఆ పార్టీకి మాజీ మంత్రి, సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపించారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలకు కూడా రాజీనామా పత్రాలను పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నానని మాత్రమే రాజీనామా లేఖలో తెలిపారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన ఉంటుందని.. ఏ పార్టీలో చేరేది అప్పుడు చెపుతానని అన్నారు.

నాలుగు సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగా కూడా పని చేశారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక 2019 ఎన్నికలకు మందు మళ్లీ వైసీపీలో చేరారు. ఇప్పుడు, వైసీపీకి మరోసారి రాజీనామా చేశారు. ఉమ్మడి ఏపీలో టీడీపీలో దాడి వీరభద్రరావు కీలక నేతగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారో త్వరలోనే తెలియనుంది.

Next Story