ప్రధాని మోదీపై నాకెలాంటి ద్వేషం లేదు: రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  10 Sept 2024 1:30 PM IST
ప్రధాని మోదీపై నాకెలాంటి ద్వేషం లేదు: రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు ప్రధాని నరేంద్ర మోదీపై ఎలాంటి ద్వేషం లేదని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్‌గాంధీ.. ప్రధాని గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడ ప్రవాస భారతీయులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగానే బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే మోదీ అంటే తనకు ద్వేషం లేదంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జార్జ్‌టౌన్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులతో ఇంటరాక్టివ్‌ సెషన్‌లో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ విషయం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు.. ప్రధాని మోదీపై నాకు ఎలాంటి ద్వేషం లేదని రాహుల్‌ గాంధీ అన్నారు. ఆయన అభిప్రాయాలు వేరు.. వాటిని తాను అంగీకరించలేనని అన్నారు. అంతే కానీ.. ఆయన్ని ద్వేషించినట్లు మాత్రం కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రధాని చేసే పనుల పట్ల తనకూ సానుకూలత ఉందని అన్నారు. అలా అని.. మంచి ఫలితాలను ఇస్తాయని అనుకోవడం లేదన్నారు. ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గురించి రాహుల్‌గాంధీ మాట్లాడారు.



Next Story