మునుగోడు ఉప ఎన్నిక.. అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌

Congress announces Palvai Sravanthi as candidate for Munugode bypoll.మునుగోడులో కాంగ్రెస్ పార్టీ త‌రుపున బ‌రిలోకి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sep 2022 7:54 AM GMT
మునుగోడు ఉప ఎన్నిక.. అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌

ఎమ్మెల్యే ప‌ద‌వికి కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేయ‌డంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఉప ఎన్నిక‌కు ఇంకా నోటిఫికేష‌న్ వెలువ‌డ‌క‌ముందే అన్ని పార్టీలు ప్ర‌చారాన్ని ప్రారంభించాయి. అయితే.. మునుగోడులో మ‌రోసారి పాగా వేయాల‌ని కాంగ్రెస్ పార్టీ బావిస్తోంది. ఈక్ర‌మంలో అంద‌రి క‌న్నా ఓ అడుగు ముందే ఉంది. ఇప్ప‌టికే ఇంటింటి ప్ర‌చారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్‌.. తాజాగా మునుగోడులో త‌మ పార్టీ త‌రుపున బ‌రిలోకి దిగే అభ్య‌ర్థి ఎవ‌రో చెప్పేసింది.

మునుగోడు ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పాల్వాయి గోవ‌ర్థ‌న్‌రెడ్డి కుమారై పాల్వాయి స్ర‌వంతిని ఖ‌రారు చేసిన‌ట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముకుల్ వాస్నిక్ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.

కాగా.. టీపీసీసీ నేత‌లు న‌లుగురు అభ్య‌ర్థుల‌తో కూడిన జాబితాను ఢిల్లీకి పంపింది. అందులో పాల్వాయి స్ర‌వంతి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత‌, ప‌ల్లె ర‌వి పేర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరిలో అధిష్టానం పాల్వాయి స్ర‌వంతి వైపే మొగ్గు చూపింది.

ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.

Next Story