కేసీఆర్‌కు మ‌హారాష్ట్ర సీఎం ఫోన్‌.. 20న ముంబ‌యి కి ముఖ్య‌మంత్రి

CM KCR will meet Maharashtra CM Uddhav Thackeray on February 20.సీఎం కేసీఆర్ మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2022 9:00 AM GMT
కేసీఆర్‌కు మ‌హారాష్ట్ర సీఎం ఫోన్‌.. 20న ముంబ‌యి కి ముఖ్య‌మంత్రి

సీఎం కేసీఆర్ మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే ఆహ్వానం మేర‌కు సీఎం కేసీఆర్ ముంబ‌యికి వెళ్ల‌నున్నారు. ఈ నెల 20న ఉద్ధ‌వ్ ఠాక్రేతో కేసీఆర్ స‌మావేశం కానున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డుతూ, ఫెడరల్ న్యాయం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి ఉద్ధ‌వ్ ఠాక్రే సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం ఉద‌యం సీఎం కేసీఆర్‌కు ఉద్ద‌వ్ ఠాక్రే ఫోన్ చేసి మాట్లాడారు.

'కేసిఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు.మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయం లో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం' అని అన్నారు. 'మిమ్మల్ని ముంబ‌యికి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. అదే సందర్భంలో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందాం' అని సీఎం కేసీఆర్‌ను ఉద్ధ‌వ్ ఠాక్రే ఆహ్వానించారు.

Next Story