తిరుప‌తి, నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల‌

Central Election Commission released by election schedule.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుపతి లోక్ సభ నియోజకవర్గం, తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు దేశ వ్యాప్తంగా ఉప ఎన్నిక‌ల షెడ్యూల్

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 16 March 2021 6:01 PM IST

Central Election Commission released by election schedule

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుపతి లోక్ సభ నియోజకవర్గం, తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు దేశ వ్యాప్తంగా ఉప ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీ) విడుద‌ల చేసింది. 2లోక్‌స‌భ‌, 14 అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఈసీ తెలిపింది. ఏప్రిల్ 17న తిరుప‌తి, నాగార్జున సాగ‌ర్‌లో ఎన్నిక‌ల పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.

ఈ నెల 30 వ‌ర‌కు నామినేష‌న్ల దాఖ‌లుకు గడువు విధించింది. 31న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని తెలిపింది. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది. మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది. ఉపఎన్నిల షెడ్యూల్ ను ప్రకటించడంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తిరుపతిలో ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, నాగార్జునసాగర్ లో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి కారణంగా ఉపఎన్నికలు జరుగుతున్నాయి.




Next Story