ఒవైసీ బ్రదర్స్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి: బండి సంజయ్

ఒవైసీ బ్రదర్స్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  22 Sept 2024 7:01 PM IST
ఒవైసీ బ్రదర్స్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి: బండి సంజయ్

ఒవైసీ బ్రదర్స్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులతో వారికి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఓల్డ్ సిటీ ఒవైసీ కనుసన్నల్లో ఉగ్రవాదుల అడ్డాగా మారిందంటూ ఆరోపణలు చేశారు. బీజేపీ సభ్యత్వ నమోదులో భాగంగా కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ తరహా వయాఖ్యలు చేశారు. కాగా.. అంతకుముందు ఎంఐఎం పార్టీ మీటింగ్‌లో ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ బండి సంజయ్‌కు ఇస్లామోఫోబియా పట్టుకుందంటూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అందుకే మదర్సాలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారంటూ ఒవైసీ చెప్పారు. దాంతో.. ఈ కామెంట్స్‌పై స్పందించిన బండి సంజయ్‌ తాజాగా కౌంటర్ ఇచ్చారు.

ఇస్లామోఫోబియా తనకేమీ లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఒవైసీ మాత్రం హిందూ ఫోబియాతో ఇబ్బంది పడుతున్నాడంటూ కౌంటర్ ఇచ్చారు. పోలీసులను తీసేసి తనకు 15 నిమిషాలు టైమిస్తే, దేశంలోని హిందువులందరినీ నరికి చంపేస్తానని అన్న వ్యక్తికి హిందూఫోబియా ఉన్నట్లేగా? అంటూ వ్యాఖ్యానించారు. ఓవైసీ సోదరులు ఎన్నడూ వందేమాతర గేయాన్ని ఆలపించలేదన్నారు. ఏ ఫోబియా వాళ్లను ఆపుతుందో చెప్పాలని బండి సంజయ్‌ ప్రశ్నించారు. హిందువులు లౌకిక విలువలను పాటిస్తూ పీర్ల పండగ జరుపుకుంటారని బండి సంజయ్‌ అన్నారు.

Next Story