బండ్ల గణేష్ కీలక నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై
Bandla Ganesh says good bye to politics.సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 30 Oct 2022 8:20 AM ISTసినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తనకున్న కుటుంబ బాధ్యతల వల్ల తప్పుకుంటున్నట్లు తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదన్నారు. తన వల్ల ఎవరైనా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ బాధపడి ఉంటే పెద్ద మనసుతో తనను క్షమిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
"నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్ "అంటూ ట్వీట్లు చేశారు. 2018లో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు….2
— BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022
…..అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్..🙏
— BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022