సీఎం కేసీఆర్‌కు బండి సంజ‌య్ బ‌హిరంగ లేఖ‌

సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షులు, ఎంపీ బండి సంజ‌య్ బ‌హిరంగ లేఖ‌ రాశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2023 2:46 PM IST
Bandi Sanjay Open Letter to KCR, Bandi Sanjay

బండి సంజ‌య్, సీఎం కేసీఆర్‌

తక్షణమే వేతన సవరణ సంఘం (PRC) ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెరిగిన ధరలకు అనుగుణంగా జూలై 1 నుండి జీతాలు చెల్లించాలని, ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షులు, ఎంపీ బండి సంజ‌య్ బ‌హిరంగ లేఖ‌ రాశారు. మీ పాల‌న‌లో ఉద్యోగ‌, ఉపాధ్యాయులు స‌హా ప్ర‌జ‌లంతా తీవ్ర‌మైన ఇబ్బందుల్లో ఉన్నార‌ని, ఉద్యోగుల స‌మ‌స్య‌లేవీ ప‌రిష్కారం కావ‌డం లేవ‌ని లేఖ‌లో బండి సంజ‌య్ పేర్కొన్నారు.

ఈ నెల 9న జ‌ర‌గ‌బోయే కేబినేట్ స‌మావేశంలో పీఆర్సీపై క‌మిటీ ఏర్పాటు చేసి పాటు మూడు నెల‌ల్లో నివేదిక తెప్పించుకుని జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమ‌ల‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల స‌మ‌యంలో, ఆ త‌రువాత‌ ఇచ్చిన హామీల్లో 99 శాతం నేటీకి అమ‌లు కాలేద‌న్నారు. రుణ‌మాఫి, ఫ్రీ యూరియా, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ద‌ళిత బంధు, ద‌ళితుల‌కు మూడు ఎక‌రాలు , గిరిజ‌న బంధు, గిరిజ‌న రిజ‌ర్వేష‌న్లు, చేనేత బంధు, పేద‌లంద‌రికీ డ‌బుల్ బెడ్రూం ఇళ్లు, సొంత జాగా ఉన్న‌వారికి రూ.3లక్ష‌ల ఆర్థిక సాయం వంటి హామీల‌ను ఇంత వ‌ర‌కు నెర‌వేర్చ‌లేద‌ని మండిప‌డ్డారు.

హామీల‌ను నెర‌వేర్చేందుకు మ‌రికొన్ని నెలలు స‌మ‌యం మాత్ర‌మే ఉంద‌న్నారు. ఇంత‌ర వ‌ర‌కు హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డం ప్ర‌జ‌ల‌ను దారుణంగా మోసం చేయ‌డ‌మేన‌న్నారు. ఈ నెల 9న జ‌ర‌గ‌బోయే రాష్ట్ర కేబినెట్ భేటీలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు అన్నింటిని చ‌ర్చించి త‌క్ష‌ణ‌మే అమ‌లు అయ్యేలా నిర్ధిష్ట కార్యాచ‌ర‌ణ రూపొందాల‌ని బండి సంజ‌య్ డిమాండ్ చేశారు. అలాకానీ ప‌క్షంలో ఆయా హామీల అమ‌లు కోసం భారీ ఎత్తున ప్ర‌జా ఉద్య‌మాలు చేప‌డ‌తామ‌ని, జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల్సి ఉంద‌ని అన్నారు.

Next Story