చంద్రబాబు అరెస్ట్‌పై బండి సంజయ్ సంచలన కామెంట్స్
చంద్రబాబుని అరెస్ట్ చేయడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరోసారి స్పందించారు.
By Srikanth Gundamalla Published on 14 Sep 2023 7:45 AM GMTచంద్రబాబు అరెస్ట్‌పై బండి సంజయ్ సంచలన కామెంట్స్
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరోసారి స్పందించారు. చంద్రబాబుని అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష్యే అని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో లేని వ్యక్తిని అరెస్ట్ ఎలా చేస్తారో అర్థం కావడం లేని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. కరీంనగర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుని అరెస్ట్ చేయడం పట్ల ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్ష్యతోనే చంద్రబాబుని అరెస్ట్ చేసినట్లు అర్థం అవుతుందని చెప్పారు. తప్పు చేస్తే అరెస్ట్ చేయడం సరికాదని ఎవరూ అనరు అన్నారు. కానీ.. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేని వ్యక్తిని అరెస్ట్ చేయడమే అర్థం కావడంలేదని అన్నారు. మాజీ సీఎంగా ఉన్న వ్యక్తిని ఆరాబాదరగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. G20 సమావేశాలు జరుగుతున్నప్పుడే అరెస్ట్ కి సమయం కుదిరిందా అని ప్రశ్నించారు. ఈ అరెస్ట్ ద్వారా ప్రజల్లో చంద్రబాబుకి మైలేజ్ వచ్చిందన్నారు బండి సంజయ్. చంద్రబాబుని అరెస్ట్ చేయడం పట్ల ప్రజలు తిరగబడే పరిస్థితి భవిష్యత్‌లో వస్తుందని ఏపీ ప్రభుత్వానికి ఎదురవుతందని బండి సంజయ్ సూచించారు.
వైసీపీ నాయకులపై ఈ సందర్భంగా మండిపడ్డారు బండి సంజయ్. తప్పుని తప్పు అని చెబితే చంద్రబాబు ఏజెంట్ అని ముద్రవేసే దురలవాటు వైసీపీ నేతలకు ఉందని విమర్శించారు. కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం స్కాం కేసులో చంద్రబాబుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతలు సహా ఇతర పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబుని బయటకు తీసుకొచ్చేందుకు న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. వరుస పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.