ఈ నెల 21న ఏపీకి బండి సంజయ్.. ఎందుకంటే..
ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
By Srikanth Gundamalla Published on 18 Aug 2023 10:15 AM GMTఈ నెల 21న ఏపీకి బండి సంజయ్.. ఎందుకంటే..
ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి కీలకంగా పనిచేసిన బండి సంజయ్.. ఇప్పుడు ఏపీ బీజేపీని కూడా ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే విధంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు. అయితే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్ ఏపీకి వెళ్లనానున్నారు. బండి సంజయ్ సేవలను తెలంగాణతో పాటు.. ఏపీలోనూ వాడుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. అందుకే జాతీయస్థాయిలో ఆయనకు పదవి ఇచ్చారు. ఈ క్రమంలో ఏపీలో ఓటరు నమోదు ప్రక్రియను బండి సంజయ్ సమీక్షించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశా రాష్ట్రాల బాధ్యతలను కూడా బండి సంజయ్‌కి బీజేపీ జాతీయ నాయకత్వం అప్పగించే అవకాశం ఉంది.
తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీ నాయకత్వాన్ని వహించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రాచరిక పాలన అంటూ బీఆర్ఎస్ సర్కార్‌ను అవకాశం దొరికినప్పడుల్లా తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో బీజేపీ శ్రేణులను ఏకం చేసి అనేక అంశాలపై ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. అలాంటి వ్యక్తి మొదటి సారి ఏపీ రాజకీయాల్లోకి వెళ్తున్న సందర్భంగా ఆసక్తి నెలకొంది. అక్కడ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారు? అనే అంశాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే.. తెలంగాణలో ఆయన స్పీచ్‌లను విన్న ఏపీ బీజేపీ నాయకులు కూడా కొందరు ఆయన రాకకోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పార్టీలో జాతీయ హోదాలో ఈ నెల 21న విజయవాడలో పర్యటించనున్నారు బండి సంజయ్. అయితే.. బండి సంజయ్‌కి ఏపీలో ఇదే తొలిసారి పర్యటించడం కావడంతో.. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.