ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలిగా పురందేశ్వరి.. తెలంగాణ చీఫ్‌గా కిషన్‌రెడ్డి నియామకం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ బీజేపీ అధ్యక్షులను మారుస్తూ కమలం పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  4 July 2023 10:09 AM GMT
AP, Telangana, BJP, Presidents, Change, JP Nadda, Purandeswari, Kishan Reddy,

ఏపీ బీజేపీ చీఫ్‌గా పురందేశ్వరి.. తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ బీజేపీ అధ్యక్షులను మారుస్తూ కమలం పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు అధ్యక్షుల పేర్లను ప్రకటిస్తూ ప్రకటన జారీ చేసింది. జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరుతో ప్రకటన వెలువడింది. ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించారు. సోమువీర్రాజుని అధ్యక్ష పదవి నుంచి తొలగించిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించాయి. కానీ.. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ జాతీయ నాయకత్వం పురందేశ్వరికి బాధ్యతలను అప్పగించింది. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి నియమించారు. ీ ఉత్తర్వులు వెలువడే ముందే బండి సంజయ్‌ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ పదవిని కిషన్‌రెడ్డికి అప్పగిస్తారనే ప్రచారాన్నే బీజేపీ అధినాయకత్వం నిజం చేసింది. పురందేశ్వరి, కిషన్‌రెడ్డిని తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులుగా నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేంద‌ర్‌కు ఎల‌క్ష‌న్ మేనేజ్‌మెంట్ క‌మిటీ చైర్మ‌న్‌గా అధిష్టానం బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఈటల గ‌త కొద్ది రోజులుగా అధిష్టానంపై గుర్రుగా ఉన్నార‌నే వార్తలు వినిపించాయి. అంతేకాదు.. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఈటలనుశాంత‌ప‌రిచేందుకు ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌ కమిటీ బాధ్య‌త‌ల అప్ప‌గింత జ‌రిగిందంటూ పలువురు బీజేపీ నేత‌లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా.. రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని ఈటల కోరినట్లు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

Next Story