మంత్రి రోజా.. నగరి సీటు నిలబెట్టుకునేనా!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ఆర్‌కె రోజాకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు దక్కకపోవచ్చని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

By అంజి  Published on  27 Aug 2023 4:00 AM GMT
AP Minister Roja, nagari, CM Jagan, APnews

మంత్రి రోజా.. నగరి సీటు నిలబెట్టుకునేనా!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె రోజాకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు దక్కకపోవచ్చని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా.. రోజాకు తన సొంత నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీతోనే కాకుండా, తన సొంత పార్టీ నాయకుల నుండే ప్రమాదం పొంచి ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నాయి. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఓ నాయకుడు రోజాకు వ్యతిరేకంగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇన్ని అసమానతలను ఎదుర్కొంటూ, రోజా తన సీటును నిలబెట్టుకోవాలని, తన సత్తాను నిరూపించుకోవాలని రోజా పోరాడుతున్నారు. మరోవైపు ఆమెను ఓడించేందుకు రోజా వ్యతిరేకులు వ్యూహారచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం (ఆగస్టు 28) నగరిలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభను గ్రాండ్‌గా సక్సెస్‌ చేసేందుకు ఆమె అన్ని విధాలా కృషి చేస్తున్నారు. నగరిలో జగన్ ప్రసంగించడం ఇదే తొలిసారి. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితుల‌ను ప‌టిష్టం చేయ‌డంతో పాటు రోజాకు ఉన్న పాపులారిటీని, ఆమె గెలుపు అవకాశాలను ప‌రీక్షించే అవ‌కాశం ఇది. ఎన్నికల వేళ సీఎం జగన్‌ నగరికి వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాబట్టి రోజా.. ఈ సభను సక్సెస్‌ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె నియోజకవర్గంలోనే మకాం వేసి ర్యాలీకి ఏర్పాట్లు చేస్తూ, తన అనుచరులతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ సభకు జనాలను సమీకరించారు. ఏర్పాట్లలో అధికారులు రోజాకు సహకరిస్తున్నప్పటికీ, జన సమీకరణలో పార్టీ నాయకుల నుండి, ముఖ్యంగా పొరుగు ప్రాంతాల నుండి ఆమెకు ప్రతిఘటన ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. “అపూర్వమైన జనాన్ని సమావేశానికి తీసుకురావడంలో ఆమె విజయం సాధిస్తే, ఆమె ముఖ్యమంత్రి విశ్వాసాన్ని గెలుచుకోవడం ఖాయం. అయితే ఇతర పార్టీల నేతలు ఆమెను ఎంతవరకు ఆ క్రెడిట్‌ని తీసుకోవడానికి అనుమతిస్తారో చూడాలి” అని వర్గాలు తెలిపాయి.

Next Story