బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాంధీ
బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పాడు.
By Srikanth Gundamalla Published on 13 July 2024 7:45 AM GMTబీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాంధీ
బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పాడు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అరికెపూడి గాంధీ. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది.
ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. అరికెపూడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి, హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్.. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. పార్టీ అధిష్టానం బుజ్జగించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నాయకులు మాత్రం వినడం లేదు. పార్టీ చేంజ్ అవుతూనే ఉన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు వెళ్లిపోతుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఆందోళన పెంచుతోంది.
బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. pic.twitter.com/VO4kZI4iKs
— Newsmeter Telugu (@NewsmeterTelugu) July 13, 2024