తమిళిసైను కలిసిన అన్నామలై.. వాటికి చెక్ పెట్టడానికేనా!!

తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై శుక్రవారం చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు.

By M.S.R  Published on  14 Jun 2024 3:00 PM GMT
annamalai, meet, tamilisai, tamilnadu, bjp,

తమిళిసైను కలిసిన అన్నామలై.. వాటికి చెక్ పెట్టడానికేనా!!  

తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై శుక్రవారం చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. తమిళిసై నివాసానికి అన్నామలై వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో పార్టీ ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు తలెత్తాయనే ఊహాగానాల మధ్య ఈ భేటీ జరిగింది.

సమావేశం అనంతరం అన్నామలై ఎక్స్‌లో “ఇంతకుముందు టి.ఎన్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన సీనియర్ నాయకులలో ఒకరైన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆమె రాజకీయ అనుభవం, సలహాలు పార్టీ ఎదుగుదలకు స్ఫూర్తినిస్తాయి." అంటూ రాసుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత.. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే తమిళనాడులో పార్టీ మెరుగైన పనితీరు కనబరిచేదని సౌందరరాజన్ అన్నారు.

చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మందలించారంటూ వైరల్ అవుతున్న వీడియోను మాజీ గవర్నర్ తమిళిసై ఖండించారు. అమిత్ షా హావభావాలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ‘‘2024 ఎన్నికల తరువాత నేను తొలిసారిగా హోం మంత్రి అమిత్ షా ను కలిశాను. ఈ సందర్భంగా ఆయన నన్ను పిలిచి ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి అడిగారు. అయితే, ఆయన సమయాభావం కారణంగా క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా పనిచేయాలని మాత్రమే చెప్పారు. ఈ ఘటన చుట్టూ నెలకొన్న ఊహాగానాలకు ముగింపు పలికేందుకే ఈ వివరణ’’ అని ఆమె తెలిపారు.

Next Story