బీజేపీకి మా అవసరం ఉంటుంది: విజయసాయిరెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla
Published on : 12 Jun 2024 8:48 PM IST

andhra pradesh, ycp, mp vijayasai reddy,  bjp, tdp,

బీజేపీకి మా అవసరం ఉంటుంది: విజయసాయిరెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి, మిథున్న రెడ్డితో కలిసి మీడియా సమావేవం నిర్వహించిన విజయసాయిరెడ్డి.. బీజేపీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. లోక్‌సభలో టీడీపీకి ఉన్నది 16 ఎంపీలో అన్నారు. కానీ.. తమకు పార్లమెంట్ ఉభయసభల్లో కలిపి 15 మంది సభ్యుల బలం ఉందని చెప్పారు. రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యుల బలం ఉన్నారని గుర్తు చేశారు. అలాగే లోక్‌సభలో నలుగురు ఎంపీలు ఉన్నారన్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కూడా భాగస్వామి అయినప్పటికీ, రాజ్యసభ విషయానికి వస్తే బీజేపీకి వైసీపీ అవసరం ఉంటుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

రాజ్యసభలో ఏదైనా బిల్లు పాస్‌ చేయాలని అంటే వైసీపీ మద్దతు బీజేపీకి అవసరం అని అన్నారు. పార్లమెంట్‌లో వాళ్లు టీడీపీపై ఎంత ఆధారపడతారో.. వైసీపీపై కూడా అంతే ఆధారపడాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. సంఖ్యాపరంగా టీడీపీతో తాము కూడా సమానంగానే ఉన్నామని విజయసాయిరెడ్డి అన్నారు.

ఇక మరోవైపు రాష్ట్రంలో టీడీపీపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ రౌడీలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని అన్నారు. తాము కాదు.. టీడీపీ వారే దాడులు చేస్తున్నారని అన్నారు. స్వేచ్చ, న్యాయం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందే దాడులకు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ దాడుల వెనుక చంద్రబాబు ఉన్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

Next Story