అబద్ధాలను నిజం చేయడానికే చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారు: బొత్స

ఏపీ ప్రభుత్వంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  28 Sept 2024 4:02 PM IST
అబద్ధాలను నిజం చేయడానికే చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారు: బొత్స

ఏపీ ప్రభుత్వంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. నెయ్యి కల్తీ జరిగిందని చెప్తున్నారనీ.. ఆయన మాటలు చూస్తుంటే జాలేస్తుందని అన్నారు. విశాఖపట్నంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన..సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు.

నెయ్యి ఎక్కడ కల్తీ జరిగిందో తెలియదని చంద్రబాబు దాని గురించే మాట్లాడుతున్నారని బొత్స వ్యాఖ్యానించారు.నెయ్యి కల్తీని చంద్రబాబు నిరూపించాలని అన్నారు. సుప్రీంకోర్టు జడ్జి లేదంటే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కల్తీ చేసిన వారిని శిక్షించాలని కోరారు. చంద్రబాబుకు చిత్తశుద్ధిఉంటే థర్డ్‌పార్టీతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తిరుమల లడ్డూ లో నెయ్యి కల్తీ అయితే.. సీఎం చంద్రబాబు సీబీఐ విచారణ కోసం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు? ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన అబద్ధాలను నిజం చేసుకోవడానికి తన మనుషులతో సిట్‌ వేసుకున్నారంటూ ఆరోపించారు. కల్తీ జరిగి ఉంటే ఎందుకు న్యాయవిచారణకు వెనుకాడుతున్నారని నిలదీశారు. దేవుడిని అడ్డుపెట్టుకుని స్వార్థరాజకీయలు చేస్తున్నారనీ.. ఇంతటి దుర్మార్గానికి ఎవరైనా పాల్పడతారా.? అంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

మాజీ సీఎం జగన్ తిరుమల వెళ్తానంటే అడ్డుకోవడం దారుణమన్నారు బొత్స. చంద్రబాబేమో ఎవరూ అడ్డుకోలేదంటున్నారనీ.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. తిరుమల వెళ్తామంటే నోటీసులు ఇచ్చారని చెప్పారు. తిరుమల వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులకు ఉందని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Next Story