జగన్‌ను చంద్రబాబు చంపేస్తానంటున్నా పట్టించుకోరా?: పోసాని
చంద్రబాబు నాయుడు పబ్లిక్‌గానే సీఎం జగన్‌ను చంపుతానని అంటున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
By Srikanth Gundamalla Published on 1 May 2024 12:29 PM ISTజగన్‌ను చంద్రబాబు చంపేస్తానంటున్నా పట్టించుకోరా?: పోసాని
ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో విమర్శలు..ప్రతి విమర్శల్లో హీట్ పెరిగింది. తాజాగా APFDC ఛైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌ను హత్య చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నో రోజులుగా కుట్రలు చేస్తున్నారని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పబ్లిక్‌గానే సీఎం జగన్‌ను చంపుతానని అంటున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
హైదరాబాద్‌లో బుధవారం పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశారు. ఎన్నికల వేళ ఫేక్ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నారంటూ బీజేపీ అగ్రనేతలను ఉద్దేశించి పోసాని కామెంట్స్ చేశారు. కానీ.. సీఎం జగన్‌ను చంపుతానంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే పట్టించుకోరా అని నిలదీశారు. ఒక ముఖ్యమంత్రి హత్యకు కుట్ర అంటే ఎంతో సీరియస్ ఇష్యూ అనీ.. ఇలాంటి కామెంట్స్ గురించి ఎవరూ స్పందించకపోవడం బాధాకరమని పోసాని కృష్ణ మురళి ఆవేదన చెందారు. ఒక ఫేక్ వీడియోకు ఉన్న విలువ సీఎం జగన్ ప్రాణానికి లేదా అని ప్రశ్నించారు.
మరోవైపు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపైనా పోసాని కృష్ణ మయురళి విమర్శలు చేశారు. సుజనా చౌదరి, సీఎం రమేశ్ ఇద్దరు నేతలు ఆర్థిక నేరస్థులంటూ ఆరోపించారు. వీరి ఆర్థిక నేరాల గురించి రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసని ఆయన అన్నారు. టీడీపీలో ఓ వెలుగు వెలుగొందుతున్న సుజనా చౌదరి బీజేపీలోకి ఎందుకు మారాల్సి వచ్చిందో ప్రజలకు ముందుగా వివరించాలని పోసాని కృష్ణ మురళి డిమాండ్ చేశారు. అధికార బీజేపీలో ఉంటే వేల కోట్లు తినొచ్చని ఆ పార్టీలో చేరారా? అని ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి. ఆర్థిక నేరస్థులకు టికెట్లు ఇవ్వడం వల్ల మీ ఇమేజ్ దెబ్బ తింటుందని ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి సూచించారు.