జ‌త‌క‌ట్టిన కాంగ్రెస్‌, టీడీపీ.. మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో పొత్తు

Andaman and Nicobar Elections Congress ties up with TDP.కాంగ్రెస్‌, తెలుగు దేశం పార్టీ(టీడీపీ)లు మ‌రోసారి పొత్తు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2022 11:54 AM IST
జ‌త‌క‌ట్టిన కాంగ్రెస్‌, టీడీపీ.. మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో పొత్తు

కాంగ్రెస్‌, తెలుగు దేశం పార్టీ(టీడీపీ)లు మ‌రోసారి పొత్తు పెట్టుకుంటున్నాయి. అయితే.. ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. అండ‌మాన్ నికోబార్‌లో త్వ‌ర‌లో మున్సిపాలిటీ, పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు ఇరు పార్టీలు జ‌ట్టు క‌ట్టాయి. ఈ విష‌యాన్ని ఏఎన్‌టీసీసీ అధ్య‌క్షుడు రంగ‌లాల్ హ‌ల్దార్‌, టీడీపీ స్థానిక అధ్య‌క్షుడు మాణిక్య‌రావు యాద‌వ్ లు వెల్ల‌డించారు.

ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజాస్వామ్యయుత పాలన కోసమే తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వారు చెప్పారు. పొత్తులో భాగంగా పోర్టుబ్లెయిర్ మునిసిపాలిటీలోని 2, 5, 16 వార్డుల్లో టీడీపీ పోటి చేస్తుండ‌గా.. మిగిలిన చోట్ల కాంగ్రెస్ పోటీ చేయ‌నుంది. మార్చి 6న పోలింగ్ జరగనుండగా.. మార్చి 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ-కాంగ్రెస్ పొత్తుల గురించి ఎలాంటి చర్చలు జరగకపోయినా అండమాన్ లో మాత్రం క‌లిసాయి. 2018లో తెలంగాణ‌లో ముంస్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాల‌తో క‌లిసి టీడీపీ పొత్తు కుదుర్చుకుని పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. రెండు పార్టీల‌కు ఆశించిన ఫ‌లితాలు మాత్రం రాలేదు. ఆ త‌రువాత నుంచి ఎక్క‌డా పొత్తు గురించి ఇరు పార్టీలు మాట్లాడ‌లేదు. ఇక రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, మిత్రులు ఉండ‌ర‌నేందుకు కాంగ్రెస్‌, టీడీపీ మైత్రీనే నిద‌ర్శ‌నం అని అంటున్నారు.

Next Story