ప్ర‌ధాని ప్ర‌సంగంపై సీఎంల‌ మ‌ధ్య ట్వీట‌ర్ వార్‌.. 'కేజ్రీవాల్ ద్రోహీ.. యోగి క్రూరుడు'

After PM Modi’s speech there is a Twitter war between the Chief Ministers.ఒక‌ప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యంలోనే నాయ‌కులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Feb 2022 6:32 AM GMT
ప్ర‌ధాని ప్ర‌సంగంపై సీఎంల‌ మ‌ధ్య ట్వీట‌ర్ వార్‌..  కేజ్రీవాల్ ద్రోహీ.. యోగి క్రూరుడు

ఒక‌ప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యంలోనే నాయ‌కులు మాట‌ల తూటాల‌ను పేల్చేవారు. ప‌క్క పార్టీల‌పై విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సందించేవారు. సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఎప్పుడు బ‌డితే అప్పుడు మాట‌ల యుద్దానికి దిగుతున్నారు. త‌ప్పుమీదంటే.. కాదు మీదంటూ ట్వీట్ల‌తో హోరెత్తిస్తున్నారు. తాజాగా ఇద్ద‌రు సీఎంల మ‌ధ్య సోమ‌వారం రాత్రి ట్వీట్ల యుద్దం న‌డిచింది. అందులో ఒక‌రు ఉత్త‌ర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కాగా మ‌రొక‌రు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ క్రేజీవాల్‌.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ‌కు స‌మాధాన‌మిస్తూ.. సోమ‌వారం పార్ల‌మెంట్ వేదిక‌గా క‌రోనా స‌మ‌యంలో వ‌ల‌స కూలీల త‌ర‌లింపుపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మాట్లాడారు. క‌రోనా స‌మ‌యంలో వ‌ల‌స కూలీలు ఎదుర్కొన్న క‌ష్టాల‌ను ప్ర‌స్తావిస్తూ.. ఢిల్లీ, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ నేతలు, ఆప్ ప్ర‌భుత్వ‌మే కారణమంటూ మండిపడ్డారు.

కాగా.. ప్ర‌ధాని చేసిన వ్యాఖ్య‌ల‌పై సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా మండిప‌డ్డారు. ప్ర‌ధాని చేసిన వ్యాఖ్య‌లు పచ్చి అబ‌ద్ద‌మ‌న్నారు. క‌రోనా స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారి ప‌ట్ల, త‌మ సొంత వారిని కోల్పోయిన వారి ప‌ట్ల ప్ర‌ధాని సున్నితంగా ఉంటార‌ని దేశ ప్ర‌జ‌లు బావించార‌ని.. అయితే ప్ర‌జ‌ల బాధ‌పై రాజ‌కీయాలు చేయ‌డం ప్ర‌ధానికి త‌గ‌దు అని క్రేజీవాల్ ట్వీట్ చేశారు.

ప్రధాని చెప్పిన సత్యాన్ని కేజ్రీవాల్ ఒప్పుకోవాలంటూ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ ట్వీట్ చేశారు. అబ‌ద్దాలు చెప్ప‌డంలో కేజ్రీవాల్ దిట్ట అంటూ మండిప‌డ్డారు. వినండి క్రేజీవాల్‌.. ఓ వైపు యావ‌త్ మాన‌వాళి క‌రోనా మ‌హ‌మ్మారితో ఇబ్బందులు ప‌డుతుంటే మీరు యూపీ కార్మికుల‌ను బ‌ల‌వంతంగా ఢిల్లీ నుంచి పంపించారు. మీ ప్రభుత్వం, అప్ర‌జాస్వామికంగా, అమాన‌వీయ చ‌ర్య‌ల వ‌ల్ల చిన్న పిల్ల‌లు, మ‌హిళ‌లు కూడా అర్థ‌రాత్రి యూపీ స‌రిహ‌ద్దుల్లో నిస్స‌హాయంగా నిలుచోవాల్సి వ‌చ్చిందన్నారు. ప్ర‌ధాని ప‌ట్ల అగౌర‌వంగా మాట్లాడిన ఆయ‌న దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

సీఎం యోగి ట్వీట్ పై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఇది విను యోగి..ఉత్తరప్రదేశ్ ప్ర‌జ‌ల మృత‌దేహాలు న‌దుల్లో తేలుతుంటే.. మీరు మాత్రం నీ ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకున్నారు. నీలాంటి కఠినమైన మరియు క్రూరమైన పాలకుడని నేను ఇంత వరకు చూడలేదు అంటూ యోగి రియాక్ష‌న్‌కు కేజ్రీవాల్ దీటుగా బ‌దులిచ్చారు.

Next Story