గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వ్యాఖ్య‌ల‌పై స్పందించిన క‌విత‌

A poem in response to Governor Tamil Sai comments.గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2023 12:37 PM IST
గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వ్యాఖ్య‌ల‌పై స్పందించిన క‌విత‌

రాజ్‌భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై క‌విత సోష‌ల్ మీడియా వేదిక‌గా కౌంట‌ర్ ఇచ్చారు. మహమ్మారి సమయంలో సెంట్రల్ విస్టా కంటే దేశం యొక్క మౌలిక సదుపాయాలను మీద దృష్టి పెట్టాల‌ని బీఆర్ఎస్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింద‌న్నారు. కేవ‌లం కొంద‌రి సంద‌ప పెంపుపై కాకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువ‌తను ప‌ట్టించుకోవ‌డం కోస‌మే తాము పోరాడుతున్నామ‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ దార్శనికతను ప్రతిధ్వనించినందుకు ధన్యవాదాలు తెలియ‌జేశారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. ప్ర‌స్తుతం క‌విత ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

రాజ్‌భవన్‌లో 74వ గ‌ణ‌తంత్ర వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్‌ తెలుగులో ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. ముందుగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గ‌ణతంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం క‌లిగిన దేశం మ‌న‌ద‌ని అన్నారు. ఆ రాజ్యాంగం ప్ర‌కార‌మే తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించింద‌న్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందన్నారు.

ఈ క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వంపై ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు. కొంద‌రికి నేను నచ్చ‌క‌పోవ‌చ్చు.. అయిన‌ప్ప‌టికి తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి రాజ్‌భ‌వ‌న్ పూర్తి స‌హ‌కారం అందిస్తోంద‌న్నారు. తెలంగాణ అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందన్నారు. కొత్త భవనాలు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదన్నారు. కొంద‌రి ఫామ్ హౌస్‌లు కాదు అంద‌రికి ఫామ్ హౌస్‌లు కావాల‌న్నారు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు.. రాష్ట్ర విద్యాలయాల్లో అంతర్జాతీయ సౌకర్యాలు ఉండాలన్నారు. తెలంగాణలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మ స్థైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న‌ట్లు చెప్పారు.

Next Story