Fact Check : అడ్డొచ్చిన కుక్కను అమెరికా పోలీసులు చంపేసిన ఘటన ఇప్పటిదేనా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Jun 2020 2:52 PM ISTజార్జ్ ఫ్లాయిడ్ మరణవార్త అమెరికాను కుదిపేసింది. ఎన్నో నగరాలలో పెద్ద ఎత్తున నిరసనలను చేపట్టారు ప్రజలు. నల్లజాతీయులపై పోలీసుల దాడులు ఇకనైనా ఆపాలంటూ ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. ఇలాంటి సమయంలో ఓ నల్లజాతీయున్ని అరెస్ట్ చేసే సమయంలో తన యజమానిని కాపాడడానికి వచ్చిన కుక్కను పోలీసులు చంపేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“Very sad, dog shows loyalty to his master but killed by police. इस कुत्ते को पुलिस की गोली इसलिए खानी पड़ी क्योंकी वो अपने मालिक के प्रति वफ़ादार था”
తన యజమాని పట్ల ఎవరో దురుసుగా ప్రవర్తిస్తున్నారని అడ్డుకోడానికి వచ్చిన కుక్కను పోలీసులు అకారణంగా చంపేశారంటూ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తన యజమానిని కుక్క ప్రేమించడమే ఇందుకు కారణమంటూ పలువురు వీడియోను పోస్టు చేశారు.
మెగా బ్రదర్, టాలీవుడ్ నటుడు నాగబాబు కూడా ఈ వీడియోను పోస్టు చేశాడు. మొత్తం మూడు ట్వీట్స్ ఈ ఘటన గురించి నాగబాబు చెప్పుకొచ్చారు. “It’s painful and disturbing to watch this upsetting video. The poor dog just wanted to save the owner. Irrespective of the situation and the charges pressed against the owner, the police could have handled the situation in a different way and not just taking the life of the dog who only wanted to protect the owner!”
“Dog is the only animal that sacrifices its life for its master.”
“Look how a dog proves its loyalty to the owner! #Faithful #Loyal #ForeverFriend. We Indians should at least have 10% of loyalty and faithfulness of a dog towards our own country. I am very upset and in great distress after watching this clip. Really ashamed to be called as a human.”
It's Painful 💔 and Disturbing to watch this upsetting video.
The poor dog just wanted to save the owner. 🥺
Irrespective of the situation and the changes pressed against the owner, the police could have handled the situation in a different way and
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 6, 2020
ఇలాంటి వీడియోలను చూసినప్పుడు చాలా బాధగా ఉంటుందని.. ఆ కుక్క తన యజమానిని కాపాడుకోవాలని అనుకుంది నాగబాబు చెప్పారు. పోలీసులు ఈ ఘటనలో కుక్క ప్రాణాలు తీయకుండా ఉండి ఉంటే బాగున్ను అని ఆయన అన్నారు. ఆ కుక్క కేవలం తన యజమానికి ఏమీ అవ్వకూడదు అన్న ఉద్దేశ్యంతోనే పోలీసుల దగ్గరకు వచ్చిందని అర్థమవుతోందన్నారు నాగబాబు.
తన యజమాని ప్రాణాలను కాపాడాలనుకునే ఏకైక జీవి కుక్క మాత్రమేనని అన్నారు. కుక్క తన యజమాని పట్ల చూపించే విశ్వాసంలో 10శాతం దేశం కోసం మనం చూపిస్తే ఎంతో బాగుంటుంది. ఈ వీడియోను చూశాక మనిషి జన్మ అంటేనే సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తోందని నాగబాబు అన్నారు.
ఈ ఘటన ఈ మధ్యనే చోటుచేసుకుందని పలువురు షేర్ చేయడం మొదలుపెట్టారు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇవని వివిధ ప్రాంతాలకు చెందిన వారు షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వీడియో ఇప్పుడు చోటుచేసుకున్న ఘటన కాదు. తప్పు ద్రోవ పట్టించే వార్త ఇది.
వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియో 2013 నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనను వీడియో తీసిన ప్రత్యక్ష సాక్షులు యుట్యూబ్ లో అప్లోడ్ చేశారు. దక్షిణ కాలిఫోర్నియాలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉన్న సమయంలో రాట్వీలర్ కుక్క తన యజమానిని కాపాడుకోడానికి కారులో నుండి కిందకు దూకింది. అలా దూకిన కుక్క పోలీసుల మీదకు ఆగ్రహంగా దూసుకువెళ్లింది. ఇంతలో ఆ పోలీసు తన తుపాకీని కుక్క మీదకు గురిపెట్టి కాల్చేశాడు. ఈ ఘటనపై అప్పట్లో అమెరికాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.
ఈ ఘటనకు సంబంధించిన పలు ఆర్టికల్స్ ఈ లింక్స్ లో చూడొచ్చు
https://abcnews.go.com/blogs/headlines/2013/07/video-shows-dog-shot-killed-by-police
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దారుణ ఘటన ఇప్పుడు చోటుచేసుకున్నది కాదు. 2013లో చోటుచేసుకున్న ఘటన.