గచ్చిబౌలిలో డివైడర్‌ను ఢీకొట్టిన పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం

By సుభాష్  Published on  6 Jan 2020 9:17 AM IST
గచ్చిబౌలిలో డివైడర్‌ను ఢీకొట్టిన పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం

హైదరాబాద్‌ లోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్‌ పెట్రోలింగ్‌ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఐటీ కారిడార్‌ కు చెందిన ఈ పెట్రోలింగ్‌ కార్‌ వేగంగా వచ్చి గచ్చిబౌలిలోని స్టేడియం సమీపంలో డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా, వాహనంలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు.. క్రేన్‌ సహాయంతో ఇన్నోవా కారును తీసుకెళ్లారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకున్నారు.

Next Story