మరో 21 రోజుల పాటు ఇండియా లాక్ డౌన్ లో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కేవలం నిత్యావసరాలు అంటే..పాలు, కూరగాయలు, మెడిసిన్ వంటి వాటి కోసం కుటుంబానికొక్కరు మాత్రమే బయటికి రావాలని మోదీ సూచించారు. అయితే..పాలు, కూరగాయలను సరఫరా చేసే ఈ కామర్స్ పై ఖాకీలు జులుం ప్రదర్శిస్తున్నారని ఈ కామర్స్ కంపెనీలు వాపోతున్నాయి. లాక్ డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో నిత్యావసరాలను సరఫరా చేసేందుకు కూడా పోలీసులు అనుమతించకపోతే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతారని చెప్తున్నారు. నిత్యావసరాల సరఫరాకు పోలీసులు అంతరాయం కలుగజేయడం వల్ల పాలు, కూరగాయల వంటి వాటిని ఊరికే చెత్తలో పారేయాల్సి వచ్చిందని ఈ కామర్స్ సంస్థల వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో అత్యవసర జోక్యం చేసుకోవాలని ఆన్ లైన్ రీటైలర్స్ కోరుతున్నారు.

Also Read : వర్క్ ఫ్రమ్ హోమ్ లో వైఫై ఇబ్బందులా ? స్పీడ్ పెంచుకోండిలా..

బిగ్ బాస్కెట్,ప్రెష్ మెనూ,పోర్టియా మెడికల్ వంటి ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంల ప్రమోటర్ కే గణేష్ ఈ విషయంపై మీడియాతో మొరపెట్టుకున్నారు. గడిచిన కొన్ని రోజులుగా పోలీసులు మమ్మల్ని తిట్టారు, కొట్టారు. ఒకరినైతే అరెస్ట్ కూడా చేశారని గణేశ్ చెప్పారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నప్పటికీ ఎసెన్షియల్ సర్వీసులను మాత్రం మినహాయింపు ఇచ్చింది. కానీ పోలీసులు ఈ విషయంలో అడ్డుతగులుతున్నారు. కిరాణా సరుకులు, ఫుడ్, మెడిసిన్స్,మెడికల్ పరికరాలు వంటివి వాటిని కూడా ఎసెన్షియల్ సర్వీసుల కింద గుర్తించినప్పటికీ ఈ మెసేజ్ క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరలేదని ఆయన తెలిపారు.

Also Read : యూత్ కి మత్తెక్కిస్తోన్న ఆహా ‘SIN’ (వీడియోతో)

అయితే పోలీసులు కలింగించిన అంతరాయాల కారణంగా చాలా వరకు పాలు, కూరగాయలు వృథా అయ్యాయంటూ గణేష్ చేసిన ఆరోపణలను ఆన్ లైన్ డెలివరీ రిటైలర్ గ్రోఫర్స్ అండ్ మీట్ డెలివరీ ప్లాట్ ఫాం అయిన్ ఫ్రెష్ హోం సమర్థించింది. 15 వేల లీటర్ల పాలు, 10,000 కిలోల కూరగాయలను బలవంతంగా పారబోయాల్సి వచ్చింది. లాక్ డౌన్ చేసిన 2 వ రోజు కూడా గుర్గావ్, నోయిడాతో పాటు హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో..ఈ ప్రాంతాల్లో తాజా పాలను అందించలేమని ఆన్‌లైన్ గ్రాసరీ రీటైలర్ గ్రోఫర్స్, మీట్ డెలివరీ ప్లాట్‌ఫాం ప్రెష్ హోం తెలిపాయి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.