తెలుగు సినిమాలతో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కన్నా ఎక్కువగా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అల్లు అరవింద్ స్థాపించిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’. ఆహా వేదికగా వెబ్ సిరీస్ లు, ఇటీవలే విడుదలైన సినిమాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తున్నాయి. ఆహా ఆవిష్కరణకు ముందు విజయ్ దేవరకొండ, నవదీప్ తదితరులు కూడా ప్రచారం చేశారు.

Also Read : మధ్య ప్రదేశ్ లో తొలి కరోనా మరణం

యువత ఇప్పుడు ఎప్పుడూ రొటీన్ గా ఉండే ప్రేమకథలకన్నా..థ్రిల్, బోల్డ్ కంటెంట్ ఉండే సినిమాలకే మొగ్గు చూపుతున్నారు. వెబ్ సిరీస్ లు కూడా వాటినే క్యాష్ చేసుకుంటున్నాయి. సినిమాలో బోల్డ్ కంటెంట్ చూపించడానికైతే సెన్సార్ అడ్డొస్తుంది కానీ..వెబ్ సిరీస్ లకు అలాంటి నియమాలేవీ లేవు. అందుకే నెట్ ఫ్లిక్స్ లో కూడా చాలా వరకూ బోల్డ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లే ఎక్కువగా వస్తుంటాయి. ఇటీవల యూట్యూబ్ లో ప్రసారమైన True Love End సిరీస్ కూడా 1 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టింది. ఇప్పుడు ‘ఆహా’ కూడా అదే బాట అందుకుంటోంది. ప్రేక్షకుల అభిరుచిని గ్రహించి అందుకు తగ్గట్లే వెబ్ సిరీస్ లు అందిస్తుంది.

Also Read : మెదడుకు పని చెప్పండి..రివార్డు గెలుచుకోండి..

కాన్సెప్ట్ పరంగా బోల్డ్ నెస్ ఉన్నా సినిమాలో చూపించిన దానికి కంటే వెబ్ సిరీస్‌లోనే కంఫర్ట్ ఎక్కువ. తాజాగా బోల్డ్ అండ్ రియలిస్టిక్‌గా తెరకెక్కిన ‘SIN’ అనే కొత్త సిరీస్ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘Nice 2 Meet U’, ‘బాబు బాగా బిజీ’ వంటి రొమాంటిక్ సినిమాల దర్శకుడు నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కిన ‘SIN’లో జెన్నిఫర్, తిరువీర్, దీప్తి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ యువతను బాగా ఆకర్షిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు శరత్ మరార్ నిర్మాతగా పనిచేశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.