ప్రపంచ దేశాలతో పాటు భారత్ లో కూడా కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రరూపాన్ని దాల్చుతోంది. బుధవారం ఉదయం తమిళనాడులో తొలి కరోనా మరణం నమోదవ్వగా..సాయంత్రానికి మధ్యప్రదేశ్ లో మరో కరోనా మరణం నమోదైంది. ఉజ్జయినికి చెందిన 65 ఏళ్ల మహిళకు ఇటీవలే కరోనా నిర్థారణవ్వగా.. ఇండోర్ లోని ప్రభుత్వ ఆస్పత్రి అయిన MY హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటోంది.

Also Read : మెదడుకు పని చెప్పండి..రివార్డు గెలుచుకోండి..

మధ్యప్రదేశ్ లో మొత్తం 14 కరోనా కేసులు నమోదవ్వగా..బుధవారం మహిళ మృతితో తొలికరోనా మరణం నమోదైంది. ఈమె మృతితో దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 12కు చేరింది. బుధవారం సాయంత్రానికి ఇండియాలో 606 కరోనా కేసులు నమోదవ్వగా..43మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Also Read : ఏటీఎంకు వెళ్ల‌కుండా ఇంటికే న‌గ‌దు.. కావాలంటే ఇలా..

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.