వర్క్ ఫ్రమ్ హోమ్ లో వైఫై ఇబ్బందులా ? స్పీడ్ పెంచుకోండిలా..

By రాణి  Published on  25 March 2020 3:34 PM GMT
వర్క్ ఫ్రమ్ హోమ్ లో వైఫై ఇబ్బందులా ? స్పీడ్ పెంచుకోండిలా..

కరోనా వైరస్ ప్రభావంతో తొలుత సాఫ్ట్ వేర్లందరికీ ఆయా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి. తర్వాత తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించడంతో ఫేస్ బుక్, గూగుల్ వంటి పెద్ద పెద్ద సంస్థలతో పాటు..చిన్న చిన్న కంపెనీలు సైతం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఆఫీసుల్లో అయితే అన్ లిమిటెడ్ వైఫై ఉంటుంది. పైగా స్పీడ్ కూడా ఎక్కువ. కానీ ఇళ్లల్లో ఉండే వైఫై కనెక్షన్లకు పరిమిత మోతాదులో మాత్రమే వైఫై స్పీడ్ ఉంటుంది. వర్క్ ఎక్కువ ఉండటం వల్ల సగం రోజుకే వైఫై అయిపోయి..స్పీడ్ తగ్గిపోతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారా ? అయితే ఇలా చేయండి. వైఫై స్పీడ్ పెరుగుతుంది.

Also Read : యూత్ కి మత్తెక్కిస్తోన్న ఆహా ‘SIN’ (వీడియోతో)

ఇంట్లో అమర్చుకున్న వైఫై మీరు రూటర్ పక్కన ఉన్నప్పుడు మాత్రమే స్పీడ్ వస్తుందా ? అయితే ముందుగా రూటర్ ఉన్న ప్రాంతాన్ని మార్చండి. అలా మార్చడం వల్ల రూటర్ యెుక్క వైర్ లైస్ కవరేజీ పై ప్రభావం చూపుతుంది. సిగ్నల్ బాగా రావడం కోసం రూటర్ ని ఇంటి మధ్యలో గోడలకు దూరంగా ఉంచండి. అలాగే రూటర్ దగ్గర ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా చూసుకోవాలి. రూటర్ డ్యూయల్ బ్యాండ్ పనితీరు ఎలా ఉందో చూసుకోవాలి. సాధారణంగా బ్యాండ్ ఫ్రీక్వెన్సీ 2.4GHz బదులుగా 5GHz గా ఉంటుంది. కాబట్టి అవసరాన్ని బట్టి రూటర్ ఫ్రీక్వెన్సీని ఎంచుకోవాలి.

Also Read : మధ్య ప్రదేశ్ లో తొలి కరోనా మరణం

మీరు నివసించే ఇంటి చుట్టుపక్కల ఎక్కువమంది ఉంటున్నారా ? ఇది కూడా మీ వైఫై తక్కువ అవ్వడానికి ఒక కారణం. ఎందుకంటే ఇతర నెట్ వర్క్, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే సిగ్నల్ మీకు కనెక్ట్ అవటానికి మీ రూటర్ పై ప్రభావం చూపుతుంది. అందుకే రూటర్ లో ఛానల్ ఎంపిక మోడ్ సెట్ చేసుకోవాలి. లేదా మీకు నచ్చినదాన్నే ఎంచుకోవాలి.

Also Read : క‌రోనా ఎఫెక్టు.. జోరందుకున్న కండోమ్ అమ్మకాలు

వైఫై రూటర్ హార్డ్ పనితీరును కూడా సరిచూసుకోవాలి. రూటర్ ని అప్ గ్రేడ్ చేయటం లేదా..రూటర్ కి డైరెక్టగా యాంటీనా కనెక్షన్ ఇవ్వటం వల్ల సిగ్నల్ బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చే రూటర్స్ లో క్వాలిటీని కూడా సెట్ చేసుకోవచ్చు. వైఫై ద్వారానే విడియో కాల్స్, ఫైల్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా ? అలాంటప్పుడు అందుకు ఎంతవరకూ క్వాలిటీ కావాలో అంతవరకే సెట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

Next Story