నిందితుల మృతదేహాలకు ఫోరెన్సి నిపుణుల ఆధ్వర్యంలో పంచనామా

By Newsmeter.Network  Published on  6 Dec 2019 1:18 PM IST
నిందితుల మృతదేహాలకు ఫోరెన్సి నిపుణుల ఆధ్వర్యంలో పంచనామా

'దిశ' అత్యాచారం, హత్య ఘటనపై నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. చర్లపల్లి జైలు నుంచి పోలీసులు నిందితులను కస్టడీకి తీసుకుని విచారణలో భాగంగా ఈ రోజు తెల్లవారు జామున 3.30 గంటలకు రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా, నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించి, పోలీసులు రాళ్లు రువ్వారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపి నలుగురిని చంపేశారు. ఎన్‌ కౌంటర్‌ నేపథ్యంలో నాలుగు మృతదేహాలు 20 నుంచి 30 అడుగుల దూరంలో పడి ఉన్నాయి. కాగా, మృతదేహాలకు పంచనామా పూర్తయింది. గాంధీ ఆసుపత్రి నుండి ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్‌ టీమ్‌, ఫోరెన్సిక్ నిపుణులు పంచనామా నిర్వహించారు. అనంతరం వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం నలుగురి మృతదేహాలను ఫరక్‌, కుందూరు, నందిగామ, చౌదరి గూడ తహసీల్దార్లకు అప్పగించనున్నారు. నిందితుల కుటుంబీకులను ఘటన స్థలానికి తీసుకెళ్లారు పోలీసులు.

Next Story