మన కళా నైపుణ్యం ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలి : ప్రధాని మోదీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2020 7:55 AM GMT
మన కళా నైపుణ్యం ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలి : ప్రధాని మోదీ

రైతులపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. కరోనా కష్టకాలంలోనూ రైతులు పంటలు పండిస్తున్నారని వారి సేవలను కొనియాడారు. ఆదివారం ఆయన మన్‌ కీ బాత్‌లో మాట్లాడారు. దేశంలో అన్నదాతలే మనకు గౌరవమన్నారు. రైతుల కృషిని కొనియాడుతూ.. మన వేదాల్లోనూ శ్లోకాలున్నాయని గుర్తుచేశారు. ఈ ఖరీప్‌లో గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారని తెలిపారు. పిల్లలు ఆడుకునే బొమ్మలు స్థానికంగానే తయారు చేయాలని ప్రధాని అన్నారు. బొమ్మల తయారీ కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన కళా నైపుణ్యం ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలన్నారు. ప్రతి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరారు. కేరళ ఓనం పండుగ ఈ రోజు అంతర్జాతీయ ఉత్సవంగా మారుతుందని తెలిపారు.

దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ స్వదేశీ యాప్‌లనే వాడాలని ప్రధాని సూచించారు. ప్రతి వేడుకను పర్యావరణహితంగా జరుపుకోవాలని అన్నారు. స్వదేశీ కంప్యూటర్ గేమ్స్ తయారీకి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొత్త ఆన్‌లైన్ గేమింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని దేశ యువతకు పిలుపునిచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలి. కులవృత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

సెప్టెంబర్‌ నెలను పోషకాహార మాసంగా పాటించాలన్నారు. బాల్యంలో అందే పోషకాలే మనిషి బౌతికంగా, మానసికంగా ధృడంగా తయారయ్యేందుకు దోహదం చేస్తాయన్నారు. కరోనా కష్టకాలంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయినా.. వాటన్నింటినీ అధిగమించారని.. సాంకేతికతను వినియోగించకుని విద్యార్థులకు చేరువయ్యాయరని ప్రశంసించారు. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలిపారు.

Next Story
Share it