చైనాలో కరోనా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ అన్ని దేశాలకు పాకుతోంది. చైనాలో కరోనా వైరస్‌ వల్ల ఇప్పటి వరకు దాదాపు 800కుపైగా మంది మరణించగా, 37,918 కేసులను నిర్ధారించారు. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన సాయం అందిస్తామని భారత ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు లేఖ రాశారు. కరోనా వైరస్‌ ను నియంత్రించడంలో చైనాకు బాసటగా నిలుస్తామని మోదీ పేర్కొన్నారు.

ఇక కరోనా వైరస్‌ వల్ల మరణించిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే చైనాకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు. కారోనా కారణంగా ప్రావియన్స్‌ నుంచి 650 మంది భారతీయులను తరలించేందుకు సహకరించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మోదీ ధన్యవాదులు తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.