జూన్ 16, 17 ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్.. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jun 2020 5:07 AM GMT
జూన్ 16, 17 ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్.. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. కరోనా వైరస్ విపరీతంగా పెరుగుతూ ఉండడంతో తీసుకోవాల్సిన, తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడనున్నారు. రెండు నెలల లాక్ డౌన్ తర్వాత రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరిస్థితులు కూడా ఆయన సమీక్షించనున్నారు. ఆన్ లైన్ మీటింగ్ జూన్ 16, 17 తేదీలలో నిర్వహించనున్నారు.

కరోనా వైరస్ సంక్షోభం తర్వాత భారత ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు మధ్య భేటీ జరగడం ఇది ఆరోసారి. ఇంతకు ముందు మీటింగ్ మే 12న జరిగింది. 21 రాష్ట్రాలకు, యూనియన్ టెర్రిటరీస్ కు జూన్ 16న సమయం ఇవ్వగా.. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న మిగిలిన 15 రాష్ట్రాలకు జూన్ 17న సమయం ఇచ్చారు. ఈ రెండు రోజులు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధానమంత్రివర్చువల్ గా భేటీ అవ్వనున్నారు.

భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి రోజూ 10000కు పైగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ చాలా దేశాలను దాటుకుని ముందుకు వెళుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న తరుణంలో లాక్ డౌన్ ను ఎత్తివేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ పెరుగుతున్న కరోనా కేసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై లాంటి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. జులై నెల ముగిసే సమయానికి ఢిల్లీలో 5.5 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తెలపడంతో ప్రజల్లో కూడా టెన్షన్ మొదలైంది.

భారత ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబైలో కరోనా వైరస్ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. ఒక్క ముంబై మహా నగరంలోనే 2000 మందికి పైగా మరణించారు. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 1 లక్ష మార్కు దాతగా.. 3700 మరణాలు సంభవించాయి. ప్రతిపక్ష పార్టీలు లాక్ డౌన్ వలన భారత్ కు ఒదిగిందేమీ లేదని చెబుతుంటే.. ప్రభుత్వ వర్గాలు మాత్రం లాక్ డౌన్ కారణంగా చాలా వరకూ కేసుల సంఖ్యను తగ్గించగలిగామని చెబుతున్నారు.

Next Story