భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 11,458 కేసులు.. 386 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jun 2020 4:22 AM GMT
భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 11,458 కేసులు.. 386 మంది మృతి

కరోనా మహమ్మారి భారత్‌లో ఉగ్రరూపం దాల్చుతోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరుకుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,458 కేసులు నమోదు కాగా.. 386 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఒక్క రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 3,08,993 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 8,884మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల్లో 1,54,330 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,45,779 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 77 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 4లక్షలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన దేశాల్లో భారత్‌ 4వ స్థానానికి చేరింది. మొదటి స్థానంలో 21లక్షల కేసులతో అమెరికా ఉండగా.. ఆ తర్వాత బ్రెజిల్‌ (8లక్షలు), రష్యా (5లక్షలు) లు ఉన్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపులతో దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఇది ఇలాగే కొనసాగితే.. త్వరలోనే ఇండియా మొదటి స్థానానికి చేరుకుంటుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it