మీరు హాట్ స్పాట్ ఏరియాల్లో ఉంటున్నారా.. ఇది గుర్తు పెట్టుకోండి..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2020 10:09 AM GMT
మీరు హాట్ స్పాట్ ఏరియాల్లో ఉంటున్నారా.. ఇది గుర్తు పెట్టుకోండి..!

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలను హాట్ స్పాట్ లు గా గుర్తిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ ప్రాంతాల విషయంలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో ఉన్న హాట్ స్పాట్ లలోనూ, కంటైన్మెంట్ జోన్ లలోనూ 30శాతం మందికి తెలియకుండానే కరోనా వైరస్ సోకడం రికవరీ అవ్వడం జరిగిపోతోందట..! సాధారణ ప్రజల మీద జరిగిన సర్వేలో ఈ విషయం తెలిసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ నిర్వహించిన సీరో-సర్వేలో ఈ విషయం బయటకు వచ్చింది. మొత్తం 60 జిల్లాలలోనూ, 6 అర్బన్ హాట్ స్పాట్ ఏరియాలలో ఈ సర్వేను నిర్వహించారు. ముంబై, చెన్నై, ఢిల్లీ, కలకత్తా లాంటి నగరాల్లో కూడా ఈ సర్వేను నిర్వహించారు.

సీరో-సర్వే.. ఇది బ్లడ్ సీరం ను ఉపయోగించి కరోనా వైరస్ యాంటీ బాడీస్ ఉన్నాయా లేదా అన్నది తెలుసుకుంటారు. 83 జిల్లాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. అందులో 10 హాట్ స్పాట్ ఏరియాలు కూడా ఉన్నాయి. ఒక్కో హాట్ స్పాట్ ఏరియా నుండి 500 శాంపుల్స్ ను.. నాన్-హాట్ స్పాట్ ఏరియా నుండి 400 శాంపుల్స్ ను సైంటిస్టులు పరీక్షించారు.

30 శాతం మందిలో ఈ వైరస్ తమకు వచ్చిందని కూడా తెలియదట.. ముంబై, ఢిల్లీ, పూణే, అహ్మదాబాద్ నగరాల్లోని శాంపుల్స్ విషయంలో ఇదే తేలింది. ఇక తక్కువ ప్రాబల్యం రూరల్ ప్రాంతాల్లో ఉన్న వారికి అని చెబుతున్నారు. రూరల్ ప్రాంతాల్లో 0.3 శాతం మందికి కరోనా వైరస్ వచ్చినట్లు కూడా తెలియడం లేదు. తమకు కరోనా వైరస్ ఎలా వచ్చింది అన్న అవగాహన కూడా కొందరికి ఉండదని ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. దీన్ని బట్టి భారత్ లో కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అన్నది లేదని స్పష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు.

ఢిల్లీలోని కరోనా పాజిటివ్ రోగుల్లో 50 శాతం మందికి కరోనా ఎలా సోకిందో తెలీదని ఢిల్లీ హెల్త్ మినిష్టర్ తెలపడంతో అక్కడ కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అన్నది చోటుచేసుకుంటోందా అన్న అనుమానాలు వచ్చాయి. కానీ ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అన్నది లేదని అధికారులు ఆ తర్వాత స్పష్టం చేశారు.

ఐసిఎంఆర్ ఛీఫ్ బలరామ్ భార్గవ గురువారం నాడు కేంద్ర ప్రభుత్వానికి కరోనా వైరస్ కు సంబంధించిన అంశాలపై వివరణ ఇచ్చారు. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సరైన డెఫినేషన్ ఇవ్వలేదని అన్నారు. భారత్ చాలా పెద్ద దేశమని.. ఇంకా మన దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అన్నది జరగలేదని ఆయన అన్నారు. భారత్ లో టెస్టింగ్ లు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్నాయని.. లక్షణాలు ఉన్న వారిని ట్రాక్ చేయడమే కాకుండా, క్వారెంటైన్ సదుపాయాలను ఎప్పటికప్పుడు పెంచుతూ ఉన్నామని అన్నారు.

Next Story
Share it