పార్టీ యువ‌నేత‌తో కేర‌ళ సీఎం కూతురు పెళ్లి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Jun 2020 2:09 PM IST
పార్టీ యువ‌నేత‌తో కేర‌ళ సీఎం కూతురు పెళ్లి

కేరళ సీఎం పినరయి విజయన్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. విజయన్ కుమార్తె వీణ వివాహం.. సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు మహ్మద్ రియాజ్‌తో జ‌రుగ‌నుంది. వీణ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఇక రియాజ్.. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కొజికోడ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్ర‌స్తుతం రియాజ్ న్యాయవాదిగా కొన‌సాగుతున్నారు.

అయితే.. వీరిద్ద‌రికి ఇంతకు ముందే వివాహాలు జ‌రిగి.. వారి వారి బాగ‌స్వాముల‌తో విడాకులు తీసుకున్నారు. దీంతో ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కానుంది. ఇదిలావుంటే.. వీణకు ఒక్కరు, రియాజ్‌కు ఇద్దరు చొప్పున ఇంతకు ముందే పిల్లలు ఉన్నారు. లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ కారణంగా కొద్దిమంది బంధువుల సమక్షంలో.. జూన్ 15న వీరిద్ద‌రూ ఒకటి కాబోతున్నారు.

ఇదిలావుంటే.. మహ్మద్ రియాజ్.. రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ పి. ఎం. అబ్దుల్ ఖాదర్ కుమారుడు. ఆయ‌న‌ 2017 సంవ‌త్స‌రం పిబ్ర‌వ‌రిలో డివైఎఫ్ఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మొద‌టి నుండి మార్క్సిస్ట్ పార్టీతో సంబంధం ఉన్న రియాజ్.. అంచెలంచెలుగా జాతీయ స్థాయి యువ నాయకుడిగా ఎదిగారు.

Next Story