Fact Check : అమిత్ షా సాధువులతో కలిసి పలు విషయాలపై చర్చించారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Sep 2020 3:05 PM GMT
Fact Check : అమిత్ షా సాధువులతో కలిసి పలు విషయాలపై చర్చించారా..?

హోం మంత్రి అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప పక్కన సాధువులు కూర్చున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

"హోమ్ మినిస్టర్ శాస్త్రవేత్తలతో మీటింగ్ పెట్టారు. అతి త్వరలో కరోనా వైరస్ కు మెడిసిన్ రాబోతోంది" అంటూ పోస్టు పెట్టారు. ఫేస్ బుక్ లో ఈ పోస్టు వైరల్ అవుతోంది.





ట్విట్టర్ లో కూడా ఈ పోస్టులు పలువురు పోస్టు చేశారు. హిందీలో ఈ పోస్టును పెట్టారు.

నిజ నిర్ధారణ:

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టు 'అబద్ధం'. ఈ ఫోటోను ఫోటో షాప్ చేసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు.

ఈ ఫోటోను గమనిస్తే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, అమిత్ షా కలిసి ఉండడాన్ని గమనించవచ్చు. యడ్యూరప్ప సాధువులతో ఉన్నారన్న కీ వర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. 2017లో పలు మీడియా సంస్థలు ఈ ఫోటోను ప్రచురించాయి. అక్టోబర్ 2, 2017 న టీవీ9 కన్నడ యూట్యూబ్ ఛానల్ లో వీడియోను అప్లోడ్ చేసింది.

టీవీ9 కన్నడ కథనం ప్రకారం బెంగళూరు లోకి డాలర్స్ కాలనీలోని యడ్యూరప్ప ఇంట్లో చోటుచేసుకుంది. ఆయన నాగా సాధువులను కలిసిన సమయం అది. ఆ వీడియోలో హోమ్ మినిస్టర్ అమిత్ షా, యడ్యూరప్ప పక్కన కూర్చుని కనపడలేదు. అమిత్ షాకు ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతోంది.

అప్పట్లో యడ్యూరప్పను కలవాలని నాగా సాధువులు ప్రయత్నించగా ఆయన మీటింగ్ లో ఉన్నారని చెబుతూ వారికి అనుమతి ఇవ్వలేదు. నాగా సాధువులు కలవడానికి వచ్చారన్న విషయం తెలుసుకున్న యడ్యూరప్ప వారిని తన నివాసంలో కలిశారని The Times of India తమ కథనంలో తెలిపింది.

Modi

ఇక అమిత్ షా ఫోటోకు సంబంధించిన సమాచారాన్ని వెతకగా The Hindu లో ఓ ఫోటో కనిపించింది. ఇందుకు Twitter/@narendramodi క్రెడిట్స్ ను ఇచ్చారు. నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ లో అమిత్ షా కూర్చున్న ఫోటో లభించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఎల్.కె.అద్వానీ లతో కలిసి కూర్చున్న ఫోటో అది. 2019 మే నెలలో లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమిత్ షా, నరేంద్ర మోదీలు మురళీ మనోహర్ జోషి, అద్వానీలను కలవడానికి వెళ్లారు. ఈ ఫోటోను ఎడిట్ చేసి యడ్యూరప్ప పక్కన కూర్చున్నట్లుగా ఎడిట్ చేశారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టు 'అబద్ధం'.

Next Story