నిజమెంత: రెండు నెలల సమయంలో మలేషియాలోని ఎస్కలేటర్ పరిస్థితి ఇదా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2020 5:46 AM GMT
నిజమెంత: రెండు నెలల సమయంలో మలేషియాలోని ఎస్కలేటర్ పరిస్థితి ఇదా..!

కరోనా మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ప్రజా రవాణా గత రెండు నెలలుగా చాలా తగ్గిపోయింది. పబ్లిక్ ప్రాంతాలు అయినటువంటి మాల్స్, పార్కులు, గుళ్లు అన్నిటినీ మూసేసారు. సరైన మైంటెనెన్సు లేకపోవడం వలన ఈ ప్రాంతాలకు ఎక్కడ నష్టం వాటిల్లుతుందోనని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కప్పటికీ.. ఈ రెండు నెలల గ్యాప్ అనంతరం మనం చూడబోయే వాటికి చాలా తేడా ఉంటుందని అనుకుంటూ ఉన్నారు.

ఎస్కలేటర్.. పూర్తిగా ఆకులతో నిండిపోయి.. తీగలు మొత్తం ఎస్కలేటర్ ను కప్పివేస్తూ కనిపిస్తున్నాయి. మలయ్ భాషతో ఈ ఎస్కలేటర్ కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

సన్ వే లాగూన్ ఎస్కలేట్(Sunway Lagoon Escalator).. ముందుకు వెళ్లే మెట్లదారి కాస్తా చెట్ల ఆకులతోనూ, పొదలతోనూ నిండిపోయిందంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు. రెండు నెలల పాటూ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇలా తయారైందని చెబుతుతున్నారు. ప్రస్తుతానికైతే వాటర్ థీమ్ పార్క్స్ సురక్షితంగా ఉన్నాయని.. వైరల్ అవుతున్న పోస్టులో ఉంది.‘escalator Sunway Lagoon’ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిజ నిర్ధారణ:

మలేషియా లోని 'సన్ వే లాగూన్' అంటూ వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'.

ఈ ఫోటోలను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను చేయగా.. ఈ ఫోటో 2019 నుండి వైరల్ అవుతోంది. చాలా వెబ్ సైట్లు.. ఈ ఫోటోను షేర్ చేస్తూ 'ప్రకృతి గెలిచింది' అని చెప్పుకొచ్చాయి.

యాహూ లోని ఓ ఆర్టికల్ లో.. భూతాపం, వాతావరణంలో మార్పుల కారణంగా భూమి మీద ఇప్పటికే చాలా ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి. వీటికి మనిషే కారణం.. మనిషి చేస్తున్న పనులు ప్రకృతికి విపత్తులా దాపురించాయి. కానీ కొన్ని కొన్ని సార్లు ప్రకృతే జయిస్తుంది అని ఫ్రెంచ్ భాషలో రాసుకొచ్చారు. మనిషి ప్రమేయం అన్నది లేకపోతే ప్రకృతి తన పని తాను చేసుకుపోతుందని దీనిని బట్టి తెలుస్తుంది.

Sunway Lagoon escalator అని సెర్చ్ చేయగా.. ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లో చాలా ఎస్కలేటర్లు కనిపించాయి.

30 Astonishing Pictures Show That Nature Can Win The Battle Against Civilization అన్న ఆర్టికల్ ను thinkinghumanity.com పబ్లిష్ చేసింది. అందులో ఒక్కొక్క ఫోటోకు ఎక్కడివో చెబుతూ క్రెడిట్స్ ను ఇచ్చారు. ఈ వైరల్ ఫోటోకు espinas3 క్రెడిట్ ఇచ్చారు. దీంతో ఆ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను వెతికితే మే 2019 లో దీన్ని తీశారు. పచ్చదనంతో నిండి ఉన్న ఎస్కలేటర్.. పట్టించుకోకుండా వదిలేసిన ఎస్కలేటర్ అని ఆ ఫోటో కింద రాసుకుని వచ్చారు. ఫోటోగ్రాఫర్ జపాన్ లోని నాగసాకికి చెందిన వారు.

AFP Fact check, Boomlive సంస్థలు ఇది మలేషియాకు చెందిన ఫోటోలు కావని తేల్చి చెప్పాయి. నాగసాకి హోలాండ్ గ్రామంలో ఉన్న డచ్ థీమ్డ్ అమ్యూజ్మెంట్ పార్క్ లోనిదని తెలిసింది. జాపనీస్ సిటీ అయిన సైకై లో పట్టించుకోకుండా వదిలేసిన థీమ్ పార్క్ కు చెందిన ఎస్కలేటర్.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా మలేషియాకు చెందిన ఎస్కలేటర్ అన్నది 'పచ్చి అబద్ధం'.

Claim Review:నిజమెంత: రెండు నెలల సమయంలో మలేషియాలోని ఎస్కలేటర్ పరిస్థితి ఇదా..!
Claim Fact Check:false
Next Story