ముఖ్యాంశాలు

  • ఫిజియోథెరపిస్టు తన్మయి ఆత్మహత్య
  • నచ్చిన వాడిని కాదని వేరే సంబంధాలు చూస్తున్న తల్లిదండ్రులు
  • మియాపూర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఘటన

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నచ్చినవాడితో కాకుండా వేరే వారితో వివాహ సంబంధాలు చూస్తున్నారని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలు తన్మయి ఓ ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తోంది. మియాపూర్‌ బీఆర్‌ కాంప్లెక్స్‌లో తమ్ముడితో కలిసి నివాసం ఉంటున్న తన్మయి స్వస్థలం వరంగల్‌.

తనతో పాటే పని చేస్తున్న వ్యక్తి తన్మయి ఇష్టపడుతున్నట్లు, అతడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు ఇటీవల చెప్పిందని సమాచారం. అయితే దానికి తన్మయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఫిజయోథెరపిస్టు తన్మయికి.. తన తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూడడం నచ్చలేదు. నచ్చిన వాడితో బతకలేనేమోనన్న భయంతో.. తన్మయి తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే తన్మయి ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.