Fact Check : బీజేపీ కార్యకర్తను ఉరి తీసిన ఫోటో మరో సారి వైరల్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Oct 2020 9:58 AM GMT
Fact Check : బీజేపీ కార్యకర్తను ఉరి తీసిన ఫోటో మరో సారి వైరల్

బీజేపీ కార్యకర్తను తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన గూండాలు చంపేశారంటూ ఓ ఫోటో సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది. చనిపోయిన వ్యక్తి టీ-షర్ట్ మీద 'బీజేపీతో పని చేసినందుకు విధించిన శిక్ష' అని రాశారు. అది ఇటీవలే చోటు చేసుకున్న ఘటన అని అందరూ అనుకుంటూ ఉన్నారు.

01



ట్విట్టర్ లో కూడా ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఓ ట్విట్టర్ యూజర్ “This is Trilochan Mahato, an 18-year-old boy from West Bengal. TMC activists murdered him and wrote on his t-shirt ‘This is a punishment for joining BJP’. Today TMC MP Derek O’Brien has gone to UP to talk about law and order. Do you see their disgusting politics?” అంటూ పోస్టు చేశాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి 18 సంవత్సరాల త్రిలోచన్ మహాతో.. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన వ్యక్తులు అతన్ని చంపి అతడి టీ-షర్ట్ మీద 'బీజేపీతో పని చేసినందుకు విధించిన శిక్ష' అని రాశారు. ఇంత నీచమైన రాజకీయాలను మనం చూసి ఉండమేమో అని పలువురు కామెంట్లు చేశారు.

నిజ నిర్ధారణ:

ఈ ఘటన 2020లో ఇటీవలి కాలంలో చోటు చేసుకుంది అన్నట్లుగా వైరల్ అవుతున్న కథనాల్లో 'ఎటువంటి నిజం లేదు'

న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పలు మీడియా సంస్థలలో ఈ ఘటన గురించి కథనాలను ప్రచురించారు. 2018 సంవత్సరంలో ఈ హత్య చోటు చేసుకుందని Swarajya, DNA మీడియా సంస్థలు కథనాలను వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని పురూలియా జిల్లాలో 2018 సంవత్సరంలో చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తిని త్రిలోచన్ మహాతో గా గుర్తించారు.. అతడు ఒక భారతీయ జనతా పార్టీ యాక్టివిస్ట్. అతడికి దగ్గరలో ఓ పోస్టర్ కూడా లభించింది. 'నువ్వు ఈ వయసులోనే బీజేపీతో పని చేస్తూ ఉన్నావు. నిన్ను చంపాలని మేము ఎలక్షన్స్ సమయం నుండి ఎదురుచూస్తూ ఉన్నాము.. నిన్ను చంపడానికి ఇప్పుడు అవకాశం లభించింది' అని రాశారు.

02

హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా 2018 మే నెలలో ఈ ఘటనపై స్పందించి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.



ANI, DNA వార్తా సంస్థల కథనాల ప్రకారం, జూన్ 24, 2018న 45 సంవత్సరాల వ్యక్తిని ఈ హత్యతో సంబంధం ఉన్న అనుమానాలతో అరెస్టు కూడా చేశారు. దీన్ని బట్టి ఈ ఘటన ఇటీవలి కాలంలో చోటు చేసుకుంది కాదని స్పష్టంగా తెలుస్తోంది.



03

ఇటీవలి కాలంలో బీజేపీ కార్యకర్తను వెస్ట్ బెంగాల్ లో చంపేశారు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన 2018 సంవత్సరంలో చోటు చేసుకుంది.

Claim Review:Fact Check : బీజేపీ కార్యకర్తను ఉరి తీసిన ఫోటో మరో సారి వైరల్
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:false
Next Story