యాంటీ రేప్ యాక్టివిస్ట్ యోగితా భయాన (Yogita Bhayana) ఒక పేపర్ క్లిప్పింగ్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. స్విజర్లాండ్ కు చెందిన స్క్వాష్ ప్లేయర్ ఆంబ్రే అలింక్స్ భారత్ లో తాను ఆడనని.. మహిళల మీద అత్యాచారాలు ఎక్కువవుతూ ఉండడంతో భారత్ లో పర్యటించాలంటే తనకు భయంగా ఉందని చెప్పినట్లుగా ఆ పేపర్ క్లిప్పింగ్ లో ఉంది.అక్టోబర్ 9, 2020న యోగితా పేపర్ క్లిప్పింగ్ ను యాడ్ చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేశారు. “Thanks for making us Global Power @narendramodi “ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

నిజ నిర్ధారణ:

స్విస్ స్క్వాష్ ప్లేయర్ ఆంబ్రే అలింక్స్ భద్రతా కారణాల వలన భారత పర్యటనకు రాను అని చెప్పినట్లుగా వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

ఆమె టోర్నమెంట్ కు భారత్ కు రాకుండా తప్పుకుంది 2018 సంవత్సరంలో.. వైరల్ అవుతున్న పోస్టు కూడా ఇప్పటిది కాదని స్పష్టంగా తెలుస్తోంది. Timesnownews, The News Minute, Indian Express లాంటి మీడియా సంస్థలు 16 సంవత్సరాల ఆంబ్రే అలింక్స్ చెన్నైలో నిర్వహించిన వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ నుండి తప్పుకుందని కథనాలు రాశాయి. కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఆంబ్రే అలింక్స్ కోచ్ అయిన పాస్కల్ బ్రూహిన్ భారత్ లో భద్రతా కారణాల వలన తప్పుకుందన్నట్లుగా వ్యాఖ్యలు చేశారని ప్రచురించాయి.

వైరల్ అవుతున్న పోస్టులపై ఆంబ్రే అలింక్స్ తల్లిదండ్రులు స్పందించారు. తన కుమార్తె భారత్ లో ప్రయత్నించకవడానికి కారణంగా భద్రతా కారణాలు కావాని స్పష్టం చేస్తూ స్టేట్మెంట్ ను విడుదల చేశారు.

స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఆంబ్రే అలింక్స్ తల్లిదండ్రులు ఇగోర్, వెలెరీ లేఖను పంపారు. తల్లిదండ్రులుగా తమ కూతురికి ఎప్పుడు కూడా భారత్ లో రక్షణ కరువైందని భావించలేదని అన్నారు. కొందరు జర్నలిస్టులు తప్పుడు కథనాలను ప్రచురించారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఆంబ్రే అలింక్స్ తో కలిసి తల్లిదండ్రులు సమ్మర్ హాలిడేస్ కు వెకేషన్ కు వెళ్లారట. ఆంబ్రే అలింక్స్ తండ్రి ఇగోర్ ఎప్పుడు చూసినా పనిలో మునిగిపోయి ఉంటారని.. అందుకనే తాము కుటుంబం కోసం టైమ్ కేటాయించామని అన్నారు. అందువలన ఆంబ్రే అలింక్స్ భారత్ టూర్ మిస్ చేసుకుందని చెప్పుకొచ్చారు. ఆంబ్రే అలింక్స్ ఈజిప్టు, మొరాకో, ట్యునీషియా, పోలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, ఇటలీ, మెక్సికో లాంటి దేశాలకు వెళ్లిందని.. భారత్ లో ఎప్పుడు కూడా రక్షణ కరువైందని తాము భావించలేదని స్పష్టం చేశారు. ఆంబ్రే అలింక్స్ భారత్ టూర్ ను మిస్ చేసుకోవడంపై వచ్చిన వందతుల్లో ఎంత మాత్రం నిజం లేదని వారు చెప్పుకొచ్చారు. ఈ వార్తలను తాము మరోసారి ఖండిస్తూ ఉన్నామని స్పష్టం చేశారు.

స్విస్ స్క్వాష్ ప్లేయర్ ఆంబ్రే అలింక్స్ భద్రతా కారణాల వలన భారత పర్యటనకు రాను అని చెప్పినట్లుగా వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.

Claim Review :   Fact Check : అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్విస్ క్రీడాకారిణి భారత్ లో ఆడనని చెప్పిందా..?
Claimed By :  Unknown
Fact Check :  false

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story