తెలంగాణ: అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి

By సుభాష్  Published on  27 Sept 2020 8:57 AM IST
తెలంగాణ: అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిచిపోయిన అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతి ఇచ్చింది. సోమవారం నుంచి బెంగళూరు మినహా కర్ణాటకలోని పలు ప్రాంతాలు, మహారాష్ట్రకు బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. రాయచూర్‌, బీదర్‌, నాందేడ్‌, పుణే, ముంబాయ్‌, చంద్రపూర్‌, నాగ్‌పూర్‌ తదితర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. అయితే మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన కార్పొరేషన్లు కూడా తెలంగాణకు బస్సు సేవలను పునరుద్దరించున్నారు.

కార్గో, పార్శిల్‌ సేవలను ప్రారంభించిన ఆర్టీసీ.. మరిన్నీ సేవలను అందించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటి వరకు పలు ప్రాంతాల మధ్య పార్శిళ్లను చేరవేస్తుండగా, ఇప్పుడు అవసరమైన పక్షంలో ఇంటి వద్దకే వాటిని చేర్చాలని నిర్ణయించింది. బస్సు స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలకు చెందిన పార్శిళ్లను వాటి వద్దకే చేర్చేందుకు నిర్ణయించింది.

Next Story