తెరుచుకోనున్న శిల్పారామం

By సుభాష్  Published on  27 Sep 2020 2:49 AM GMT
తెరుచుకోనున్న శిల్పారామం

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా పార్కులు, టూరిజం సెంటర్లు మూతపడిన విషయం తెలిసిందే. అన్‌లాక్‌లో భాగంగా కొన్నికొన్నింటిని సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటోంది. ఇక హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ సమీపంలోని పల్లె అందాలను కళ్లక కట్టిపడేసే శిల్పారామం అక్టోబర్‌ 2 నుంచి తెరుచుకోనుంది. శిల్పారామం తెరుచుకోనుండటంతో సందర్శకుల తాకిడి మొదలు కానుంది.

మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శిల్పారామం తెరుచుకోనుంది. పర్యటకులకు థర్మల్ చెక్‌ చేసిన తర్వాతే లోపలికి అనుమతించనున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అర్బన్‌ పార్కులను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కోవిడ్‌ నిబంధనలను అనుసరించి సందర్శకులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతించాలని అధికారులు ప్రభుత్వం ఆదేశించింది.

Next Story