దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sep 2020 2:31 PM GMT
దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి తారకరామారావు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్‌ ట్రాఫిక్ కష్టాలు తీర్చే.. ఈ తీగల వంతెన నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45ను కలుపుతూ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్‌‌కు పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్‌వేగా నామకరణం చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్డి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువు వంతెనను నిర్మించింది. ఎస్సార్‌డీపీ పనుల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ దీని నిర్మాణం చేపట్టింది. 21వ శతాబ్దపు ఇంజనీరింగ్‌ అద్భుతంగా అధికారులు చెబుతున్నారు. 754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జితో.. మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. రోడ్‌ నంబర్‌ 36, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌లో ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఉపశమనం లభిస్తుంది.

Next Story