వారెవ్వా.. లాక్‌డౌన్ చింతే లేదు.. తెగ చూసేస్తున్నారు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 April 2020 11:50 AM GMT
వారెవ్వా.. లాక్‌డౌన్ చింతే లేదు.. తెగ చూసేస్తున్నారు.!

క‌రోనా సృష్టిస్తున్న‌ బీభ‌త్సానికి ఎక్క‌డి జ‌నజీవ‌నం అక్క‌డే స్థంభించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. అయితే లాక్‌డౌన్ ప‌మ‌యంలో జ‌నాలు ఏం చేస్తున్నారు..? అస‌లే బుర్ర‌కో వెర్రితో ఉండే జ‌నం.. ఈ లాక్‌డౌన్‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేయ‌డ‌మేంటి అనుకున్నారా..? అవును మ‌న ర‌సిక మ‌హ‌రాజులు ఓ రేంజ్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ కాల‌క్షేపం చేస్తున్నార‌ట‌.

ఇక లాక్‌డౌన్ వేళ.. మ‌న‌దేశంలో కూడా అశ్లీల వెబ్‌సైట్‌లు చూసేవారు ఓరేంజ్‌లో ఆసక్తి కన‌బ‌రుస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఎంత‌లా అంటే పోర్న్‌ వీక్షణలో ఇండియాను టాప్‌ ప్లేస్‌లో నిలిపే అంత‌. ఇండియాలో లాక్‌డౌన్ విధించిన నాటినుండి.. అశ్లీల సైట్లను చూసేవారి ట్రాఫిక్‌ 95 శాతం పెరిగింది. లాక్‌డౌన్‌ అంక్షలు ప్రారంభ‌మ‌యిన మార్చి చివ‌రివారంలో భారత్‌లో అశ్లీల వెబ్‌సైట్‌లు చూసే వీక్షకుల సంఖ్య‌ పెరుగుదల 20 శాతంగా ఉంది. ఈ గ‌ణాంకాల‌ను ప్రపంచంలోని అతిపెద్ద పోర్న్ సైట్ అయిన పోర్న్‌హబ్ విడుదల చేసింది.

యూర‌ప్‌లో మార్చి 17న లాక్‌డౌన్ ప్రారంభమైన తర్వాత ప్రాన్స్‌లో పోర్న్‌ వీక్షకుల సంఖ్య 40 శాతం.. జర్మనీలో మార్చి 22న లాక్‌డౌన్ ప్రారంభమై త‌ర్వాత‌ 25 శాతం పెరిగింది. కరోనా విజృంభణతో అత‌లాకుత‌లం అవుతున్న‌ ఇటలీలో కూడా ట్రాఫిక్‌ 55 శాతం పెరిగింద‌ని పోర్న్‌హ‌బ్ వెల్ల‌డించింది.

లాక్‌డౌన్ కార‌ణంగా చాలా మంది ఇళ్లకే పరిమిత‌మ‌వ‌డం.. స్కూళ్లు, ఆఫీస్‌లు మూత‌ప‌డ‌టం ఈ ట్రాఫిక్ పెర‌గ‌డానికి కార‌ణంగా చెప్పొచ్చు. ఇక మ‌న దేశంలో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం ఎక్కువ‌గా ఉండ‌టం కూడా పోర్న్‌ వీక్షకుల సంఖ్య పెరిగడానికి ఓ కార‌ణం. ఇదిలావుంటే.. భార‌త్‌లో ప్ర‌భుత్వం చాలా మేరకు అశ్లీల సైట్ల‌ను నిషేధించిన‌ప్ప‌టికీ.. కొన్ని సైట్లు అందుబాటులో ఉన్నాయి.

Next Story